twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాగిణి ద్వివేది డ్రగ్ కేసులో ట్విస్టు.. కన్నడ సర్కార్‌కు సుప్రీం కోర్టు ఝలక్

    |

    కర్ణాటకలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో చిన్న ట్విస్టు చోటుచేసుకొన్నది. మూడు నెలల క్రితం కర్టాటక రాష్ట్ర పోలీసుల జరిపిన సోదాల్లో షాకింగ్‌గా విషయాలు బయటకు వచ్చాయి. పలువురు సినీ తారలు నిషేధిత మాదక ద్రవ్యాల ఉపయోగించినట్టు ఆరోపణలు వచ్చాయి. పలు ఆరోపణలపై హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా తదితరులను అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ హీరోయిన్ రాగిణి ద్వివేది సుప్రీకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలు ఏమిటంటే..

    90 రోజులుగా జైలులో

    90 రోజులుగా జైలులో

    కర్ణాటక డ్రగ్స్ కేసులో 90 రోజులుగా జైలులో ఉంటున్న రాగిణి ద్వివేది సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా జైలులో నిర్బంధించి తనకు బెయిల్ ఇవ్వడం లేదు అంటూ తన పిటిషన్‌లో పేర్కొన్నది. ఈ కేసులో తనకు బెయిల్ ఇప్పించాలంటూ రాగిణి సుప్రీం కోర్టును కోరింది. ఈ క్రమంలో రాగిణి పిటిషన్‌పై విచారణ చేపట్టింది.

    సుప్రీం కోర్టు విచారణ

    సుప్రీం కోర్టు విచారణ

    నటి రాగిణి దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకొన్న సుప్రీంకోర్టు జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, నవీన్ సిన్హా, కేఎం జోసెఫ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ కేసులో రాగిణికి ఎందుకు బెయిల్ ఇవ్వడం లేదో తెలియజేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది.

    పబ్లిసిటీ కోసమే అరెస్ట్

    పబ్లిసిటీ కోసమే అరెస్ట్

    హీరోయిన్ రాగిణి ద్వివేది తరఫున సిద్ధార్థ్ లుథ్రా తన క్లయింట్ తరఫున వాదనలు వినిపించారు. కేవలం మీడియా ట్రయల్స్, పబ్లిక్ అటెన్షన్ కోసమే అరెస్ట్ చేశారు. కేవలం ఆరోపణలపైనే తన క్లయింట్‌ను వేధిస్తున్నారు. సుమారు 90 రోజులుగా జైలులో ఉంచారు. తన క్లయింట్ రాగిణి బాధితురాలిగా మారింది. ఆమె నుంచి ఎలాంటి డ్రగ్స్ స్వాధీనం చేసుకోలేదు అంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.

    Recommended Video

    Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Controversial Post On Bigg Boss Contestants
    కన్నడ తారలపై తీవ్ర ఆరోపణలు

    కన్నడ తారలపై తీవ్ర ఆరోపణలు

    ఇదిలా ఉండగా, కన్నడ నటి రాగిణి ద్వివేది అరెస్ట్ తర్వాత పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ మాఫియా పోలీసుల కళ్లగప్పి తమ వ్యాపారాన్ని ఎలా చేశారు. పలువురు సినీ తారలకు ఈ మాఫియాతో సంబంధాలు ఉన్నట్టు పేర్కొన్నారు. డ్రగ్స్ రాకెట్ కేసులో సినీ హీరోయిన్లు రాగిణి, సంజన, నిర్మాత శివ ప్రకాశ్ లాంటి పలుమార్లు దరఖాస్తు చేసుకొన్న బెయిల్ పిటిషన్లను కోర్టు బెంగళూరు కోర్టు తోసిపుచ్చింది. దాంతో రాగిణి సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

    English summary
    Kannada Actress Ragini Dwivedi's files bail plea in Supreme Court. In that case, SC issues notice to Karnataka goverment. on Friday issued a notice on a plea moved by Kannada film actress Ragini Dwivedi seeking bail in the Sandalwood drugs case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X