హీరోయిన్ కోసం బాయ్‌ఫ్రెండ్స్ కొట్లాట... ప్రియుడి తలపై మాజీ లవర్ బాటిల్‌‌తో దాడి!

కన్నడ నటి రాగిణి ద్వివేది కోసం ఇద్దరు ప్రియులు కొట్లాడుకొన్న సంఘటన సినీ వర్గాలను షాక్ గురిచేసింది. బెంగళూరులోని రిట్జ్ కార్టన్ హోటల్‌లో శుక్రవారం చోటుచేసుకోగా ఆలస్యంగా ఈ ఘటన వెలుగుచూసింది. ఈ గొడవ ప్రస్తుతం కన్నడ సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. హీరోయిన్ రాగిణి కోసం గొడవ పడిన ఆ ఇద్దరు ఎవరంటే?..

 హీరోయిన్ రాగిణి ద్వివేదికి చేదు అనుభవం

హీరోయిన్ రాగిణి ద్వివేదికి చేదు అనుభవం

హీరోయిన్ రాగిణి ద్వివేదికి వ్యాపారి శివప్రకాశ్‌కు గతంలో రిలేషన్స్ ఉండేది. కొన్ని కారణాల వల్ల మనస్పర్ధలు ఏర్పడటంతో వారిద్దరూ దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత ఆర్టీవో శాఖలో అధికారిగా పనిచేస్తున్న రవిశంకర్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకొన్నారు. శుక్రవారం రాత్రి రవిశంకర్‌తో కలిసి రిట్జ్ కార్టన్‌కు వెళ్లి పార్టీ చేసుకొన్నారు.

రాగిణితో మాజీ లవర్‌ గొడవ

రాగిణితో మాజీ లవర్‌ గొడవ

రాగిణి ద్వివేది, రవి రిట్జ్ హోటల్‌కు వెళ్లిన సమయంలో అక్కడే మాజీ స్నేహితుడు శివప్రకాశ్ తన స్నేహితులతో పార్టీ చేసుకొంటున్నాడు. ఆ సమయంలో రవితో రాగిణి రావడాన్ని చూసి తట్టుకోలేక శివప్రకాశ్ గొడవపడ్డాడు. దాంతో రవి, శివ ప్రకాశ్ మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకొన్నది అని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

 రాగిణి లవర్‌పై బీర్ బాటిల్‌తో దాడి

రాగిణి లవర్‌పై బీర్ బాటిల్‌తో దాడి

రాగిణి ద్వివేది కోసం రవి, శివ ప్రకాశ్‌ల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకోవడంతో వారిని విడిపించేందుకు హోటల్ సిబ్బంది ప్రయత్నించారు. ఈ క్రమంలోనే రవి తలపై బీర్ బాటిల్‌తో శివ ప్రకాశ్ దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనంతరం ప్రాథమిక చికిత్స చేసి వారిని అక్కడి నుంచి పంపిచేశారు.

హత్యాయత్నం కింద కేసు నమోదు

హత్యాయత్నం కింద కేసు నమోదు

ఈ గోడవ నేపథ్యంలో తనపై దాడి చేసిన శివప్రసాద్‌పై రవి, రాగిణి అశోక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మరోసారి రాగిణి ద్వివేదితో కనిపిస్తే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడినట్టు రవి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపీసీ 506, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అశోక్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విదేశాలకు పారిపోయిన రాగిణి ద్వివేది

విదేశాలకు పారిపోయిన రాగిణి ద్వివేది

కాగా, రవిశంకర్, శివ ప్రకాశ్ గొడవ చిలికి చిలికి గాలివానగా మారిన నేపథ్యంలో రాగిణి విదేశాలకు వెళ్లినట్టు సమాచారం. శనివారం రాత్రి తన తల్లితో కలిసి రాగిణి దుబాయ్‌కు వెళ్లారని ఆమె సన్నిహితులు వెల్లడిస్తున్నారు. గొడవ తనకు చుట్టుకోకుండా రాగిణి పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది. ఎవరికీ అందుబాటులో లేకుండా మొబైల్ స్విచ్ఛాఫ్ చేసినట్టు తెలిసింది.

రవి ప్రకాశ్ భార్య సరికొత్త ట్విస్టు

రవి ప్రకాశ్ భార్య సరికొత్త ట్విస్టు

ఇదిలా ఉండగా, రాగిణితో సన్నిహితంగా ఉండటంపై రవితో ఆయన భార్య గొడవపడినట్టు సమాచారం. శివప్రకాశ్‌తో గొడవకు కొన్ని గంటల ముందే ఈ ఘటన చోటుచేసుకొన్నట్టు తెలిసింది. రాగిణి కోసం నా జీవితాన్ని నాశనం చేశావు. నీకు తగిన బుద్ధి చెబుతాను. నీవు ఎక్కడ, ఏ హోటల్‌లో ఉన్నావో నాకు తెలుసు అంటూ రవిని తన భార్య హెచ్చరించినట్టు సమాచారం. ఇది జరిగిన కాసేపటికే ఈ శివప్రకాశ్‌తో గొడవ జరగడం అనేక అనుమానాలకు దారి తీసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X