twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాగిణి అరెస్ట్‌తో సంచలన విషయాలు.. పోలీసులకే మస్కా.. ఆంధ్రా నుంచి భారీగా డ్రగ్స్

    |

    కన్నడ నటి రాగిణి ద్వివేది అరెస్ట్ తర్వాత డ్రగ్స్ మాఫియా కదలికల గురించి ఆసక్తకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బెంగళూరులోని 31వ అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌కు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో డ్రగ్స్ సప్లయిదారులు పోలీసుల కళ్లగప్పి తమ వ్యాపారాన్ని ఎలా చేశారనే విషయం బయటకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

    రిపోర్ట్ రిపోర్టులో ఆసక్తి విషయాలు

    రిపోర్ట్ రిపోర్టులో ఆసక్తి విషయాలు

    బెంగళూరులో జోరుగా డ్రగ్స్ దందా సాగుతున్నదనే విషయం రెండు నెలల క్రితం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. సంపన్న, ప్రముఖుల నిర్వహించే పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే విషయాన్ని పోలీసులు కనిపెట్టారు అనే విషయం తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్టు సమాచారం.

    రాగిణి ద్వివేది స్నేహితుడే కీలక సూత్రధారి

    రాగిణి ద్వివేది స్నేహితుడే కీలక సూత్రధారి

    ప్రముఖ నటి రాగిణి ద్వివేది స్నేహితుడు రవి శంకర్ వాట్సాప్‌ ఛాట్‌ను స్వాధీనం చేసుకొన్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ఫామ్ హౌస్‌, నైట్ క్లబ్స్, పబ్స్, ఫైవ్‌స్టార్ హోటళ్లలో జరిగే విలాసవంతమైన పార్టీలకు ప్రశాంత్ రంకాతో కలిసి రవిశంకర్ డ్రగ్స్ సరఫరా చేసేవారనే విషయాన్ని తెలుసుకొన్నారు. వాట్సప్ చాటింగ్ కారణంగానే డ్రగ్స్ తీగ లాగితే డొంక కదిలిందనే విషయాన్ని రిపోర్టులో పేర్కొన్నారు.

    పోలీసుల వెంటాడుతున్నారు.. జాగ్రత్త

    పోలీసుల వెంటాడుతున్నారు.. జాగ్రత్త


    ప్రముఖులపై సెంట్రల్ క్రైమ్ పోలీసులు నిఘా పెట్టారనే విషయాన్ని తెలుసుకొన్న రవి శంకర్.. డ్రగ్స్ సప్లయిదారులతో మాట్లాడకు అంటూ ప్రశాంత్ రంకాను రవిశంకర్ హెచ్చరించారని, అందుకు సమాధానంగా చాలా రోజుల నుంచి డ్రగ్స్ వినియోగించడం లేదు చెప్పినట్టు తెలిసింది. డ్రగ్స్ మాఫియా కదలికలపై పోలీస్ జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ దర్యాప్తు ప్రారంభించారు. అందరిపై దృష్టిపెట్టారు.. జాగ్రత్త అంటూ రవిశంకర్ మెసేజ్ పంపినట్టు పోలీసులు గుర్తించారు.

    శ్రీలంక వాసి సహాయంతో డ్రగ్స్ దిగుమతి

    శ్రీలంక వాసి సహాయంతో డ్రగ్స్ దిగుమతి

    తాజా అరెస్ట్ తర్వాత రవి శంకర్ పలు పార్టీలకు కొకైన్, ఓపియెట్ లాంటి నిషేధిత డ్రగ్స్‌ను సరఫరా చేశారు. శ్రీలంకకు చెదిన లూమ్ పెప్పర్ సహాయంతో డ్రగ్స్ సమకూర్చుకొన్నాడు. బెంగళూరులోని పలు ప్రదేశాల్లో జరిగిన పార్టీలకు రవిశంకర్ ప్రమాదకరమైన డ్రగ్స్ సరఫరా చేశారనే విషయాన్ని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.

    Recommended Video

    TV Serial Actress Ragini About Her Husband || Filmibeat Telugu
    ఏపీ, గోవా, పంజాబ్ నుంచి

    ఏపీ, గోవా, పంజాబ్ నుంచి

    బెంగళూరులోని విలాసవంతమైన పార్టీలకు ఆంధ్రప్రదేశ్, పంజాబ్, కేరళ, ముంబై, గోవా, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొన్నారు. కర్ణాటక నుంచి ఇతర రాష్ట్రాలకు డ్రగ్స్ అక్రమ రవాణా జరిగింది. ఆ విషయాలపై లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అని తమ రిమాండ్ రిపోర్టులో సీసీబీ పేర్కొన్నది.

    English summary
    Ragini Dwivedi's remand report throws sensational things in Bangalore Drug Rocket. Ravi Shankar, and Prashant Ranka was keeps their eyes on Bangalore CCB movement in City. They procured drugs to parties with help of Sri lankan drug peddler.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X