రష్మిక మందన్న మరీ అంత కఠినాత్మురాలా? భగ్గుమన్న ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఫ్యాన్స్!
తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న రష్మిక మందన్న గతంలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టిని ప్రేమించిన సంగతి తెలిసిందే. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. జులై 3, 2017లో బెంగుళూరులో వీరి నిశ్చితార్థం వైభవంగా జరిగింది. అయితే విబేధాలు రావడంతో పెళ్లి రద్దు చేసుకుని విడిపోయారు.
రష్మికతో తన బ్రేకప్ విషయంలో జరుగుతున్న ప్రచారంతో చాలా డిస్ట్రబ్ అయిన రక్షిత్ శెట్టి చివరకు తన సోషల్ మీడియా అకౌంట్స్ డీ యాక్టివేట్ చేశాడు. దాదాపు 10 నెలల గ్యాప్ తర్వాత తన పుట్టినరోజు(జూన్ 6) సందర్భంగా మళ్లీ వాటిని యాక్టివేట్ చేశాడు. ఈ సందర్భంగా రక్షిత్ తన లేటెస్ట్ మూవీ 'అవనె శ్రీమన్నారాయణ' టీజర్ విడుదల చేశారు.
పుట్టినరోజు సందర్భంగా రక్షిత్ శెట్టిని... రష్మిక కనీసం విష్ కూడా చేయక పోవడంపై కన్నడ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. రష్మిక మందన్న చాలా కఠినాత్మురాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనికి తోడు రష్మిక జూన్ 7న ఇతర సినిమాలను ప్రమోట్ చేస్తూ ట్వీట్స్ చేయడంతో వారు మరింత ఆగ్రహంతో ఊగిపోయారు.

రష్మిక నటిస్తున్న 'డియర్ కామ్రేడ్' మూవీ విడుదలకు మరో 50 రోజుల సమయం ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఆమె ట్వీట్ చేశారు. దీంతో పాటు 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' మూవీ ట్రైలర్ షేర్ చేశారు. వీటిని చూసిన రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ కామెంట్లతో విరుచుకుపడ్డారు.
ఈ సంగతి పక్కన పెడితే... రక్షిత్ శెట్టితో పెళ్లి కంటే తన కెరీర్ ముఖ్యమని భావించిన రష్మిక ఇపుడు పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదుగుతోంది. మహేష్ బాబు హీరోగా అనిల్ రావపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. దీంతో పాటు తమిళ స్టార్ విజయ్ 64వ చిత్రంలో కూడా అవకాశం దక్కించుకున్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











