రష్మికతో పెళ్లి పెటాకులయ్యాక అన్నీ క్లోజ్ చేశాడు... మాజీ ప్రియుడి రీ ఎంట్రీ!

Recommended Video

Rakshit Shetty To Make A Comeback On Social Media || Filmibeat Telugu

తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న రష్మిక మందన్న.... గతంలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టిని ప్రేమించిన సంగతి తెలిసిందే. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. బెంగుళూరులో వీరి నిశ్చితార్థం వైభవంగా జరిగింది. అయితే ఏవో విబేధాలు రావడంతో పెళ్లి రద్దు చేసుకుని విడిపోయారు.

తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి 'గీత గోవిందం' సినిమా చేస్తున్న సమయంలో వీరి బ్రేకప్ జరుగడంతో రకరకాల ప్రచారం జరింది. విజయ్ దేవరకొండతో ముద్దు సీన్ చేయడం వల్లే ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయనే రూమర్స్ సైతం అప్పట్లో హల్ చల్ చేశాయి.

సోషల్ మీడియా అకౌంట్స్ డీ యాక్టివేట్ చేశాడు

సోషల్ మీడియా అకౌంట్స్ డీ యాక్టివేట్ చేశాడు

రష్మికతో తన బ్రేకప్ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న గంధరగోళం భరించలేక చాలా డిస్ట్రబ్ అయిన రక్షిత్ శెట్టి చివరకు తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ డీ యాక్టివేట్ చేశాడు. ఈ డిస్ట్రబెన్స్ వల్ల తాను ఇతర పనులపై కాన్సన్‌ట్రేట్ చేయలేకపోతున్నట్లు తెలిపిన రక్షిత్... తాత్కాలికంగా సోషల్ మీడియా అకౌంట్లను మూసి వేస్తున్న ప్రకటించారు.

పది నెలల తర్వాత రీ ఎంట్రీ..

పది నెలల తర్వాత రీ ఎంట్రీ..

దాదాపు 10 నెలల గ్యాప్ తర్వాత రక్షిత్ శెట్టి.... సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అభిమానుల కోరిక మేరకు తన పుట్టినరోజు జూన్ 5 సందర్భంగా తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ రీయాక్టివేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి వాటిని తన డిజిటల్ టీమ్ హ్యాండిల్ చేస్తుందట.

సినిమా పనుల్లో రక్షిత్ బిజీ బిజీ

సినిమా పనుల్లో రక్షిత్ బిజీ బిజీ

రక్షిత్ శెట్టి ప్రస్తుతం తాజా చిత్రం ‘అవనె శ్రీమన్నారాయణ' మూవీ షూటింగులో బిజీగా గడుపుతున్నారు. సోషల్ మీడియా అకౌంట్స్ రీ యాక్టివేట్ తర్వాత అభిమానులతో తన సినిమాకు సంబంధించిన అప్‌‌‌డేట్స్ స్వయంగా పంచుకోనున్నారు.

బ్రేకప్ కారణం ముద్దు సీన్ కాదు

బ్రేకప్ కారణం ముద్దు సీన్ కాదు

గతంలో ఓ ఇంటర్వ్యూలో రక్షిత్ శెట్టి మాట్లాడుతూ విజయ్ దేవరకొండతో రష్మిక కిస్సింగ్ సీన్ చేయడం తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ‘‘ఆ సీన్లు చేసేపుడు ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో నాకు తెలుసు. సినిమాల్లో ఉన్నపుడు అవి తప్పదు. ఆ స్థానంలో నేను ఉన్నా అలాగే చేస్తాను. అదే పని నేను చేస్తే పెద్ద ఇష్యూ అయ్యేది కాదు.. కానీ గర్ల్ చేయడం వల్ల దాన్ని చాలా మంది జడ్జ్ చేస్తున్నారు. ఈ లోకం తీరే అంత''... అని రక్షిత్ శెట్టి చెప్పుకొచ్చారు. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేక పోయినా... రెండు ఫ్యామిలీస్ మధ్య అపార్థాలు పెరగడం వల్ల వీరి పెళ్లి రద్దయినట్లు టాక్.

రిలేషన్ కంటే కెరీర్ ముఖ్యమని భావించిన రష్మిక

రిలేషన్ కంటే కెరీర్ ముఖ్యమని భావించిన రష్మిక

ఇటు ఫ్యామిలీలో గొడవలతో సతమతం అయిన రష్మిక... చివరకు అతడితో రిలేషన్ కంటే కెరీరే ముఖ్యమని భావించిందని, ఈ క్రమంలోనే ఎంగేజ్మెంట్ రద్దు చేసుకోవడానికి సుముఖత చూపిందని, అలా రష్మిక, రక్షిత్ విడిపోయినట్లు అప్పట్లో కన్నడ మీడియాలో వార్తలు వినిపించాయి. ప్రస్తుతం రష్మిక సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతోంది. తాజాగా ఆమె మహేష్ బాబు హీరోగా రూపందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X