దుమ్ముదులిపేస్తున్న రాంచరణ్, సమంత.. 60 ఏళ్ల రికార్డును తిరగరాసిన రంగస్థలం

Recommended Video

Rangasthalam Creates Sensation In Malayalam | Ram Charan | Samantha || Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రాంచరణ్, టాలెంటెడ్ హీరోయిన్ సమంత కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రం రంగస్థలం. సుకుమార్‌ను మరోసారి సెన్సేషనల్ డైరెక్టర్‌గా మార్చివేసింది. మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్‌కు కాసుల పంట పండించింది. అలాంటి రంగస్థలం ప్రస్తుతం మరోసారి కన్నడనాట మోత మోగిస్తున్నది. ఈ చిత్రం ఇటీవల రిలీజై అనూహ్య స్పందనను కూడగట్టుకొంటున్నది. రంగస్థల పేరుతో కన్నడలో హిట్ టాక్‌తో దూసుకెళ్తున్న సినిమా గురించి మరిన్నీ వివరాలు మీకోసం..

డబ్బింగ్ చిత్రాలపై నిషేధంతో

డబ్బింగ్ చిత్రాలపై నిషేధంతో

గత కొద్ది రోజుల క్రితం వరకు, కన్నడ చిత్ర పరిశ్రమలో డబ్బింగ్ చిత్రాలపై నిషేధం ఉంది. గతేడాది యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ చిత్రం కన్నడతోపాటు హిందీ, తెలుగు ఇతర భాషల్లో భారీ వసూళ్లు సాధించడంతో కన్నడ చిత్ర నిర్మాతలు తమ నిర్ణయాన్ని మార్చుకొన్నారు. పరభాషా చిత్రాలు కన్నడ భాషలో డబ్ చేసుకొని రిలీజ్ చేయవచ్చని తీర్మానించారు. దాంతో ఇతర భాష చిత్రాలకు లైన్ క్రియర్ అయింది.

దశాబ్దాల తర్వాత కన్నడ చిత్రంగా రంగస్థల

దశాబ్దాల తర్వాత కన్నడ చిత్రంగా రంగస్థల

దశాబ్దాలుగా కన్నడ భాషలో పరభాష చిత్రాలు డబ్బింగ్ అయి రిలీజైన దాఖలాలు లేవు. కన్నడ పరిశ్రమలో మార్పుల తర్వాత విడుదలైన తొలి చిత్రం రంగస్థలం కావడం ఓ విశేషంగా చెప్పుకోవచ్చు. గతంలో మాయ బజార్ సినిమానే కన్నడలో చివరి డబ్బింగ్ చిత్రమని సినీ పండితులు చెప్పుకొంటారు. 1957లో చివరిసారిగా మాయబజార్ డబ్బింగ్ చిత్రంగా రిలీజైంది. అలాంటి సుదీర్ఘమైన నిషేధం తర్వాత రంగస్థలం చిత్రం రంగస్థలగా రావడం, అన్ని వర్గాలను ఆకట్టుకోవడం జరుగుతున్నది.

రికార్డు స్థాయిలో రిలీజ్

రికార్డు స్థాయిలో రిలీజ్

రంగస్థలం చిత్రం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళంలో కూడా డబ్ అయి సంచలన విజయం సాధించింది. కాస్త లేటైనా లేటేస్టుగా ఈ చిత్రంలో కన్నడ వెర్సన్‌లో విడుదలైంది. ఈ సినిమా జూలై 12న కర్ణాటక వ్యాప్తంగా సుమారు 85 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఒక్క బెంగళూరులోనే తొలి రోజు 26 షోలు ప్రదర్శించడం గమనార్హం. అయితే తొలి ఆట నుంచే రంగస్థల సినిమాకు సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్లడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్టిబ్యూటర్ జాక్ మంజు రిలీజ్ చేశారు.

టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద

టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద

రంగస్థలం చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరుగరాసింది. రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో రూ.115 కోట్ల షేర్ రాబట్టింది. ఓవర్సీస్ మార్కెట్‌ను కూడా కుదిపేసింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో సుమారు మూడు మిలియన్ డాలర్లను వసూలు చేయడం గమనార్హం. రాంచరణ్ కెరీర్‌లోనే అతి పెద్ద హిట్‌గా నిలిచింది. సమంత నటనకు, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌కు బ్రహ్మండ పేరు ప్రఖ్యాతులు లభించాయి. అయితే కన్నడలో ఈ చిత్రం ఏ రేంజ్‌లో వసూళ్లను రాబడుతుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X