డబ్బు కోసమే నా భర్తను బుట్టలో వేసుకొంది.. నరేష్ పిచ్చోడిలా.. పవిత్రా లోకేష్‌పై మండిపడ్డ మూడో భార్య
ప్రముఖ నటుడు వీకే నరేష్‌పై ఇప్పటి వరకు ఆరోపణలు చేస్తూ వచ్చిన ఆయన మూడో భార్య రమ్య రఘుపతి తాజాగా నటి పవిత్రా లోకేష్‌పై కూడా ఘాటైన వ్యాఖ్యలు సంధించింది. మైసూరులోని ఓ హోటల్ గదిలో నరేష్, పవిత్రా లోకేష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టించిన తర్వాత రమ్య రఘుపతి మీడియాతో మాట్లాడుతూ వారిద్దరిపై తీవ్రస్థాయిలో విమర్శలు సంధించింది. రమ్య రఘుపతి చేసిన సంచలన ఆరోణల్లోకి వెళితే..

10 సంవత్సరాల నుంచి నరేష్‌తో
నా భర్త నరేష్‌తో పవిత్ర లోకేష్ గత 10 సంవత్సరాల నుంచి సంబంధం పెట్టుకొన్నది. నా భర్త గురించి, ఆయన ఆస్థి గురించి తెలుసుకొన్న ఆమె ఆయనతో రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్నది. కేవలం డబ్బు కోసమే ఆమె నా భర్తను నాకు దూరం చేస్తున్నది. అంతకుమించి వారిద్దరి మధ్య మరో బంధం లేదు అని రమ్య రఘుపతి విమర్శించారు.

ఫ్రెండ్స్ అయితే అలా ఉంటారా?
వీకే నరేష్, పవిత్రా లోకేష్ స్నేహితులైతే.. ఒకే గదిలో ఎందుకు ఉంటారు. వారిద్దరు బెంగళూరు అపార్ట్‌మెంట్‌లో కలిసి జీవిస్తారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నందున్న నరేష్ తట్టుకోలేకపోయాడు. అందుకే ఆయన పిచ్చివాడిలో గెంతులు వేస్తూ.. విజిల్స్ వేస్తూ, ఏదో పిచ్చిగా అరుస్తూ నాపై ఆరోపణలు చేశారు అని భర్తపై రమ్య ఘాటుగా స్పందించారు.

నా భర్త మంచివాడైతే..
నాకు నరేష్‌తో పదేళ్ల పరిచయం ఉంది. అతడు ఏంటో, అతడి వేషభాషలేంటో నాకు పూర్తిగా తెలుసు. నా భర్త మంచి వాడైతే.. నేను మరొకరిని ఎందుకు అనుమానిస్తాను. మూడో వ్యక్తిని నేను ఎందుకు టార్గెట్ చేస్తాను. ఏది ఏమైనా నా భర్త నాకు కావాల్సిందే. నేను ఆయనకు విడాకులు ఇవ్వను అని రమ్య తెగేసి చెప్పింది అని రమ్య రఘుపతి చెప్పారు.

నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తారా?
పవిత్ర లోకేష్‌కు డబ్బు పిచ్చి ఎక్కువ. కేవలం డబ్బు కోసమే నా భర్తను బుట్టలో వేసుకొన్నది.అంతేగానీ అతడిపై ప్రేమ ఉండి కాదు. ఇప్పటి వరకు నేను పవిత్రను ఏమీ అనలేదు. నాపై వారిద్దరూ చేస్తున్న కామెంట్లు, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్న తీరు వల్లే నేను ఆ ఇద్దరి బాగోతం బయటపెట్టాను అని రమ్య రఘుపతి విమర్శించారు.

వీకే నరేష్, పవిత్ర లోకేష్ మౌనంగా
అయితే మైసూరులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన తర్వాత వీకే నరేష్ గానీ, పవిత్రా లోకేష్ గానీ స్పందించలేదు. వారిద్దరూ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తారేమో అనుకొన్నారు. కానీ రమ్య రఘుపతి విమర్శలకు, ఆరోపణలకు వీకే నరేష్, పవిత్ర ఎలాంటి సమాధానం ఇస్తారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











