నీకు దమ్ముందా? నీ తండ్రికి పుట్టావనుకొంటే.. వీకే నరేష్‌పై మూడో భార్య సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ నటుడు వీకే నరేష్, పవిత్రా లోకేష్ పెళ్లివార్తలు మీడియాలో స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో ఆయన మూడో భార్య రమ్య రఘుపతి ఘాటుగా స్పందించారు. తన భర్త నరేష్ తనపై రూమర్లు, అవాస్తవాలను, ఆరోపణలతో మీడియాలో కథనాలు రాయిస్తున్నారు. నా ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్ర పన్నారంటూ రమ్య సంచలన వ్యాఖల్యు చేసింది. తాజాగా కన్నడ మీడియాకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

నాపై అసత్యాలు ప్రచారం

నాపై అసత్యాలు ప్రచారం

కొందరి వద్ద డబ్బులు చేసి అవకతవకలకు పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలు, నమోదైన కేసులో వాస్తవం లేదు. నాపై ఆరోపణలు చేసిన వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని ముట్టజెప్పాను. కోవిడ్ పరిస్థితుల కారణంగా డబ్బు చెల్లింపు విషయంలో జాప్యం జరిగింది. నాపై కేసు నమోదు చేసిన ఆ ఐదుగురికి న్యాయం చేశాను. వారితో ఇప్పటికీ నాకు కమ్యూకేషన్ ఉంది అని రమ్య రఘుపతి తెలిపారు.

నాపై వీకే నరేష్ అలాంటి కుట్ర

నాపై వీకే నరేష్ అలాంటి కుట్ర

నాపై కొందరిని ఉసిగొలిపే ప్రయత్నం చేశారు. ఆ ఐదుగురిని రెచ్చగొట్టి పోలీస్ స్టేషన్‌కు పంపించారు. నాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఒత్తిడి చేశారు. నాపై నెగిటివ్‌ను ప్రచారం చేసి లబ్ది పొందాలని అనుకొన్నారు. నా కుటుంబ ప్రతిష్టను బజారుకీడ్చే ప్రయత్నం చేశారు. నేను పరారీలో ఉన్నానని చెప్పారు. నాపై ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. ఆయన కూతురు, ఈయన కూతురు అని చెప్పినేను డబ్బులు వసూలు చేసుకొన్నానని అవాస్తవాలను ప్రచారం చేశారు అని వీకే నరేష్‌పై రమ్య రఘుపతి ధ్వజమెత్తారు.

నీకు దమ్ముంటే అంటూ సవాల్

నీకు దమ్ముంటే అంటూ సవాల్

వీకే నరేష్‌పై ఓ దశలో రమ్య రఘుపతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. నీకు దమ్ముంటే.. నీవు నీ తండ్రికి పుట్టావనుకొంటే.. నీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకో. నా ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడుతావు అని ఘాటుగా స్పందించారు. ఇప్పటికీ నేను నీ భార్యనే. ఎవరైనా నరేష్ భార్యను అని ప్రస్తావిస్తే.. దురదృష్టవశాత్తు స్పందించాల్సి వస్తున్నది అని రమ్య రఘుపతి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకా వీకే నరేష్ భార్యనే

ఇంకా వీకే నరేష్ భార్యనే

వీకే నరేష్‌తో నా సంబంధాలు తెగిపోలేదని రమ్య రఘుపతి స్పష్టం చేశారు. ఇంకా నా పేరుకు నా భర్త పేరు జోడిస్తున్నారు. ఏనాడు నేను నా భర్త పేరు తగిలించుకోలేదు. నా పేరు ఇప్పటికీ రమ్య రఘుపతి మాత్రమే. నేను నరేష్ భార్యనని చెప్పుకొని మాట్లాడటంలో తప్పేమీ లేదు. రఘువీరారెడ్డి ఫ్యామిలీ పేరును నేను ఎక్కడా వాడుకోలేదు. నా ఫ్యామిలీ పేరు వాడుకొంటే నాకు గర్వం అయినా వాడుకోవడం లేదు. నేను ఇంకా డైవోర్స్ పేపర్స్‌పై సంతకాలు చేయలేదు అని రమ్య రఘుపతి చెప్పారు.

నాపై కట్టుకథలు చెప్పి అవాస్తవాలు..

నాపై కట్టుకథలు చెప్పి అవాస్తవాలు..

నటుడు నరేష్ నేను చెప్పని విషయాలను, నాపై కట్టుకథలను మీడియాలో వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు జరుగుతున్న అన్యాయానికి న్యాయం కోసం పోరాడుతున్నాను. నేను స్వయంగా జర్నలిస్టును. అలాంటి నాపై మీడియానే కట్టుకథలను ప్రచారం చేస్తున్నది. కేవలం మీ ఛానెల్ మాత్రమే వాస్తవాలను ప్రచారం చేస్తున్నది. నా ఇంటర్వ్యూ కావాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కానీ నేను మీకు మాత్రమే నా ఆవేదన చెప్పుకోవాలని వచ్చాను అని రమ్య రఘుపతి అన్నారు.

Recommended Video

YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia
పెళ్లి చేసుకొంటే నా పరిస్థితి ఏమిటి?

పెళ్లి చేసుకొంటే నా పరిస్థితి ఏమిటి?

అయితే నా భర్త వీకే నరేష్‌తో నాకు సత్సంబంధాలు లేవు. నాకు ఇవ్వాల్సిన మెయింటెన్స్‌లో అస్పష్టత ఉంది. నాకు విడాకులు ఇవ్వకుండా మ్యారేజ్ కోసం ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఒకవేళ ఆయనకు మ్యారేజ్ అయితే నా పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X