పవిత్రా లోకేష్ దారుణంగా నమ్మక ద్రోహం.. వీకే నరేష్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాడు.. జాగ్రత్త అంటూ భార్య వార్నింగ్
ప్రముఖ నటి పవిత్రా లోకేష్‌తో పెళ్లి వార్తల నేపథ్యంలో నటుడు వీకే నరేష్ భార్య రమ్య రఘుపతి తీవ్రంగా స్పందించింది. గత రెండు రోజులుగా రమ్య రఘుపతి కన్నడ మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూ సెన్సేషనల్‌గా మారాయి. పవిత్రా లోకేష్, వీకే నరేష్‌పై ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ మీడియా ఛానెల్‌తో రమ్య రఘుపతి మాట్లాడుతూ..

పవిత్రా లోకేష్ గురించి తెలుసు
పవిత్రా లోకేష్ నాకు బాగా తెలుసు. ఆమె నా ఇంటికి వస్తే సాదరంగా ఆహ్వానించే దానిని. ఇంటికి పెద్దగా నా భర్తకు పరిచయం, సన్నిహితులను ఆదరించడం నాకు అలవాటు. నా భర్తకు పరిచయం ఉన్న వ్యక్తిగా భావించిన ఆమెను ఇంటికి ఆహ్వానించాను. మా ఇంటికి ప్రతీ రోజు గెస్టులు, అతిథులు రావడం సర్వసాధారణం. ఆమెను గెస్టుగానే ఆహ్వానించి లంచ్ ఏర్పాటు చేశాను అని రమ్య రఘుపతి వెల్లడించారు.

నా భర్తపై రూమర్లు వస్తే..
పవిత్రా లోకేష్, నరేష్ గురించి వచ్చిన రూమర్లను పట్టించుకోలేదు. సాటి కన్నడిగా ఆమెను చూశాను. నేను కర్ణాటకలో పుట్టి పెరిగాను. కాబట్టి నేను కన్నడ వాసుల మాదిరిగానే ఫీలవుతాను. కానీ నాకు పవిత్రా లోకేష్ చేసిన మోసాన్ని తలచుకొంటే బాధగా ఉంటుంది. వాళ్లిద్దరూ ఏ నిర్ణయం తీసుకొంటారో.. ఎలా ముందుకెళ్తారో నాకు తెలియదు. నేను పట్టించుకోను. కానీ నా భర్తకు నేను విడాకులు ఇచ్చే ప్రసక్తి లేదు అని రమ్య రఘుపతి తెలిపారు.

వీకే నరేష్ బెదిరింపులతో
వీకే నరేష్ బెదిరింపులు గురించి స్పందిస్తూ.. నాపై ఎన్ని ఆరోపణలు చేసినా.. నా గురించి ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా.. నేను పట్టించుకోను. ఎలాంటి ఒత్తిడి తెచ్చినా నేను లొంగను. ప్రస్తుతం వాతావరణం బాగాలేదు. దీనిపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయను. నా ఫ్యామిలీ దేనికి బయపడదు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాను అని రమ్య రఘుపతి అన్నారు.

నా హక్కుల కోసం పోరాటం
పవిత్రా లోకేష్, నరేష్ గురించిన వ్యవహారానికి త్వరలోనే ముగింపు పడుతుంది. కాకపోతే కాస్త సమయం పడుతుంది. నేను చెప్పేది వార్నింగ్ అనుకోండి. ఇంకా ఏమైనా అనుకోండి. నాకు జరిగిన అన్యాయంపై పోరాడుతాను. న్యాయం లభించేంత వరకు నేను నా హక్కుల కోసం పోరాటం చేస్తాను. అందులో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదు అని రమ్య రఘుపతి అన్నారు.

తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోంటారు
అయితే పవిత్రా లోకేష్, నరేష్‌పై రమ్య రఘుపతి తీవ్రంగా స్పందించారు. పవిత్రా లోకేష్ నా ఫ్యామిలీ గురించి దారుణంగా మాట్లాడుతున్నది. అవాస్తవాలను ప్రచారం చేస్తున్నది. నా ఫ్యామిలీ ప్రతిష్టకు భంగం కలిగించేలా పవిత్రా లోకేష్ వ్యవహరిస్తున్నది. ఎవరైనా సరే.. వారి వెనుక ఎవరు ఉన్నా సరే.. వారి చర్యలకు బాధ్యత వహించాలి. పవిత్రా లోకేష్, వీకే నరేష్ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే నా వార్నింగ్, లేదా ఛాలెంజ్ అని రమ్య రఘుపతి సవాల్ విసిరారు.


Click it and Unblock the Notifications











