పాత ఎఫైర్ గురించి కెలికారు.... వారి నుంచి రష్మికను కాపాడిన విజయ్ దేవరకొండ!
Recommended Video
కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో రష్మిక మందన్న ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ ఇద్దరు నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో పెళ్లి రద్దు చేసుకుని విడిపోయారు.
రష్మిక మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి... రక్షిత్ శెట్టితో బ్రేకప్ గురించి ప్రశ్నలు ఎదురువుతూనే ఉన్నాయి. తన తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్' ప్రమోషన్లో భాగంగా బెంగుళురు వచ్చిన సందర్భంగా కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. అయితే ఈ సారి ఆమెను విజయ్ దేవరకొండ రక్షించే ప్రయత్నం చేశారు.

రిపోర్టర్ల నోరు మూయించిన విజయ్ దేవరకొండ
రష్మిక-రక్షిత్ శెట్టి బ్రేకప్ గురించి ఓ కన్నడ రిపోర్టర్ అడిగే ప్రయత్నం చేయగా.... విజయ్ దేవరకొండ కల్పించుకున్నారు. ‘‘మీరు ఏం అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు... ఇది ఏ ఒక్కరి వ్యక్తిగతమైన మీటింగ్ కాదు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్. ఇందులోకి ఇతర అనవసర విషయాలను తీసుకురావొద్దు.'' అంటూ వారి నోరు మూయించారు.

రష్మికను ఇబ్బంది పెట్టే ప్రయత్నం
అయితే కొందరు రిపోర్టర్లు ఇదే ప్రశ్నలు అడిగి రష్మికను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియా పేజీలో కూడా అభిమానులు కూడా మీ బ్రేకప్ గురించి అడుగుతున్నారు, దీనిపై మీరు స్పందించాలంటూ ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఆ విషయం దాటవేసిన రష్మిక
అభిమానులతో నాకు మంచి రాపో ఉంది. వారితో నా అభిప్రాయాలు తరచూ పంచుకుంటూ ఉంటాను. నా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంటాను అని... రష్మిక అసలు విషయం దాటవేసే ప్రయత్నం చేశారు. రక్షిత్ శెట్టితో కలిసి పని చేయడానికి సిద్ధమేనా? అనే ప్రశ్నకు ‘చూద్దాం' అంటూ సమాధానం ఇచ్చారు.

రష్మిక-రక్షిత్ శెట్టి
రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన ‘కిరిక్ పార్టీ' అనే కన్నడ సినిమా ద్వారా రష్మిక హీరోయిన్‌గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. తమ ప్రేమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా 2017లో నిశ్చితార్థం జరుపుకున్నారు. అయితే కొన్ని అనుకోని కారణాలతో వీరి రిలేషన్ పెళ్లి వరకు వెళ్లక ముందే తెగిపోయింది.


Click it and Unblock the Notifications











