Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘కేజీఎఫ్ చాప్టర్ 2’లో సంజయ్ దత్, రవీనా టండన్
కన్నడ రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో రూపొందిన 'కెజిఎఫ్ చాప్టర్ 1' సంచలన విజయం అందుకున్న నేపథ్యంలో త్వరలో రాబోయే చాప్టర్ 2ను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్ గ్రాబ్ చేయడమే లక్ష్యంగా అక్కడి స్టార్లను సినిమాలో భాగం చేయాలనే ప్లాన్‌లో దర్శక నిర్మాతలు ఉన్నారు.
సంజయ్ దత్‌ను ఓ ముఖ్యమైన పాత్ర కోసం సంప్రదించినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇపుడు మరో నటి రవీనా టండన్‌తో చిత్ర బృందం సంప్రదింపులు జరుపుతోందని టాక్. చాప్టర్ 2లో రవీనా పాత్ర దాదాపుగా ఖరారైనట్లే అని తెలుస్తోంది.
ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో యష్ మాట్లాడుతూ.. సంజయ్ దత్తో సంప్రదింపులు జరుపుతున్న మాట నిజమే అన్నారు. ఆయన ఓకే చెబితే దత్ నటిస్తున్న తొలి సౌత్ మూవీ ఇదే కానుంది. ఆయన ప్రాజెక్టుపై సైన్ చేసిన అరంతరం అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సంజయ్ దత్, రవీనా టండన్ ఈ ప్రాజుక్టులోభాగం అయితే 'కెజిఎఫ్ చాప్టర్ 2' బాలీవుడ్లో సంచలనం క్రియేట్ చేయడం ఖాయం.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'కెజిఎఫ్ చాప్టర్ 1' గతేడాది డిసెంబర్ చివరి వారంలో విడుదలై భారీ విజయం అందుకుంది. కన్నడలో రూ. 100 కోట్ల మార్క్ సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. దీంతో పాటు తెలుగు, తమిళం, హిందీలో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా రూ. 225 కోట్లకుపైగా వసూలు చేసింది.