twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కేజీఎఫ్ చాప్టర్ 2’లో సంజయ్ దత్, రవీనా టండన్

    |

    కన్నడ రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో రూపొందిన 'కెజిఎఫ్ చాప్టర్ 1' సంచలన విజయం అందుకున్న నేపథ్యంలో త్వరలో రాబోయే చాప్టర్ 2ను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్ గ్రాబ్ చేయడమే లక్ష్యంగా అక్కడి స్టార్లను సినిమాలో భాగం చేయాలనే ప్లాన్లో దర్శక నిర్మాతలు ఉన్నారు.

    సంజయ్ దత్‌ను ఓ ముఖ్యమైన పాత్ర కోసం సంప్రదించినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇపుడు మరో నటి రవీనా టండన్‌తో చిత్ర బృందం సంప్రదింపులు జరుపుతోందని టాక్. చాప్టర్ 2లో రవీనా పాత్ర దాదాపుగా ఖరారైనట్లే అని తెలుస్తోంది.

    Raveena Tandon in KGF Chapter 2

    ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో యష్ మాట్లాడుతూ.. సంజయ్ దత్‌‌తో సంప్రదింపులు జరుపుతున్న మాట నిజమే అన్నారు. ఆయన ఓకే చెబితే దత్ నటిస్తున్న తొలి సౌత్ మూవీ ఇదే కానుంది. ఆయన ప్రాజెక్టుపై సైన్ చేసిన అరంతరం అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సంజయ్ దత్, రవీనా టండన్ ఈ ప్రాజుక్టులోభాగం అయితే 'కెజిఎఫ్ చాప్టర్ 2' బాలీవుడ్లో సంచలనం క్రియేట్ చేయడం ఖాయం.

    ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'కెజిఎఫ్ చాప్టర్ 1' గతేడాది డిసెంబర్ చివరి వారంలో విడుదలై భారీ విజయం అందుకుంది. కన్నడలో రూ. 100 కోట్ల మార్క్ సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. దీంతో పాటు తెలుగు, తమిళం, హిందీలో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా రూ. 225 కోట్లకుపైగా వసూలు చేసింది.

    English summary
    After Yash revealed that Sanjay Dutt had been approached to star in KGF Chapter 2, Raveena Tandon has now confirmed that she too has been approached by the makers of the Kannada film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X