బ్యాంకాక్‌లో కన్నడ స్టార్ హీరో భార్య మృతి.. అంత్యక్రియలు ఎప్పుడు? మరణానికి కారణాలు అవే అంటూ!
కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర సతీమణి స్పందన మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. తన కజిన్స్‌తో బ్యాంకాక్ ట్రిప్‌కు వెళ్లిన స్పందన గుండెపోటుకు గురయ్యారు. అయితే గుండెపోటుకు కారణాలపై వైద్యులు అనుమానాలను వ్యక్తం చేస్తూ కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాంకాక్ నుంచి స్పందన భౌతికకాయం బెంగళూరుకు చేరుకొన్నది. ఈ క్రమంలో స్పందన మరణం గురించి వైద్యులు ఏం వెల్లడించారు? అలాగే స్పందన వ్యక్తిగత జీవితం వివరాల్లోకి వెళితే..
కన్నడ లెజెండరీ యాక్టర్ రాజ్‌కుమార్ ఫ్యామిలీకి చెందిన నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన. రాజ్‌కుమార్ అల్లుడిగా ప్రముఖ నిర్మాత చిన్నె గౌడ సుపరిచితులు. ఆయన కుమారుడే విజయ్ రాఘవేంద్ర. ఇటీవల స్పందన బ్యాంకాక్ ట్రిప్‌కు వెళ్లారు. వేకేషన్‌లో ఉండగానే ఆమె గుండెపోటుతో మరణించారు. గుండెపోటుకు కారణం లో బ్లడ్ ప్రెజర్ అని వైద్యులు నిర్ధారించారు. ఆమె వయసు 45 సంవత్సరాలు.

బ్యాంకాక్ నుంచి స్పందన భౌతికకాయాన్ని బెంగళూరుకు చేర్చారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సందర్శనార్థం స్పందన తండ్రి ఫామ్‌హౌజ్‌లో ఉంచారు. బుధవారం మధ్యాహ్నం బెంగళూరులో స్పందన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
స్పందన మృతి విషయంలో బ్లడ్ ప్రెజర్ కారణంగా గుండెపోటు వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే లో బ్లడ్ ప్రెజర్ కారణంగా గుండెపోటు రావడానికి ఆస్కారం ఉంది. చాలా తక్కువ సందర్భాల్లో అలాంటి పరిస్థితి కనిపిస్తుంటుంది. లో బ్లడ్ ప్రెజర్ కారణంగా గుండెపోటు రాదని చెప్పడానికి కారణాలు లేవు. దానిని కొట్టిపడేయలేమని వైద్యులు పేర్కొంటున్నారు.

బ్లడ్ ప్రెజర్ కారణంగా గుండెకు, ప్రధాన అవయవాలకు ఆక్సిజన్ అందడం తగ్గిపోతుంది. అలా నిరంతరం జరిగితే గుండెపోటు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బ్లడ్ ప్రెజర్ తగ్గడం వల్ల గుండెపోటు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎక్కువగా రక్తహీనత ఉండటం, ఇన్‌ఫెక్షన్స్‌కు గురికావడం, థైరాయిడ్ సంబంధిత సమస్యల వల్ల గుండెపోటు రావడానికి అవకాశం ఉంది అని వైద్యులు పేర్కొంటున్నారు.
స్పందన విజయ్ రాఘవేంద్ర విషయానికి వస్తే.. పోలీస్ అధికారి బీకే శివరాం కుమార్తె. 1985లో బెంగళూరులో జన్మించింది. బెంగళూరులోని ఎంఈఎస్ కాలేజీ నుంచి డిగ్రీ పాసయ్యారు. 2007లో విజయ్ రాఘవేంద్రతో వివాహం జరిగింది. బ్యాంకాక్ ట్రిప్‌లో గుండెపోటుకు గురైంది. సకాలంలో వైద్యం అందక ఆమె తుదిశ్వాస విడిచారు.


Click it and Unblock the Notifications











