మిడిల్ ఫింగర్ చూపించిన స్టార్ హీరో .. కొవ్వు తగ్గలేదంటూ నెటిజన్ల ట్రోలింగ్

కొందరికి పుట్టుకతో వచ్చినవి మరణించాక కానీ పోవు. ఈ విషయంలో ఎవ్వరూ అతీతులు కాదు. ఈ సూత్రం కన్నడ స్టార్ హీరో దర్శన్‌కి అతికినట్లుగా సరిపోతుంది. అభిమానిని దారుణంగా చంపిన కేసులో సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నా దర్శన్‌లో తప్పు చేశానన్న పశ్చాత్తాపం అణువంత కూడా లేదు. తన పరపతితో జైలులోనూ రాజభోగాలు అనుభవిస్తూ దొరికిపోయిన దర్శన్ తాజాగా కొత్త వివాదంలో ఇరుక్కున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ఛాలెంజింగ్ స్టార్‌గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే కన్నడ స్టార్ హీరో దర్శన్‌.. స్వయంగా తన వీరాభిమానినే హత్య చేసి జైలుకెళ్లడం భారతీయ చిత్ర పరిశ్రమలోనే సంచలనం సృష్టించింది. తనతో సహజీవనం చేస్తోన్న పవిత్ర గౌడ అనే మహిళకు అసభ్య సందేశాలు పంపుతూ వేధిస్తోన్న రేణుకా స్వామిని అతను తన అనుచరులతో కలిసి అత్యంత పాశవికంగా హతమార్చాడు. అక్కడితో ఆగకుండా మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్నించడం తదితర అభియోగాలపై దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Renukaswamy Murder Case Accused Kannada Actor Darshan Thoogudeepa Shows Middle Finger To Media Video goes viral

అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీలో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో దర్శన్ ఖైదీగా ఉన్నారు. పలుమార్లు ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్ట్ తిరస్కరించింది. ఈ పరిణామాలతో మా హీరో అసలు బయటకు వస్తారా.. లేదంటే సెంట్రల్ జైలుకే పరిమితం అవుతారా అంటూ దర్శన్ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక జైల్లో దర్శన్‌కు రాచమర్యాదలు లభిస్తున్నాయి. జైలు ఆవరణలో పలువురితో ముచ్చటిస్తూ కాఫీ , సిగరెట్ తాగుతూ రిలాక్స్ అవుతోన్న దర్శన్ ఫోటో వైరల్ అయ్యింది.

దర్శన్‌కు రాచమర్యాదలు చేసిన ఏడుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసింది. ఆ వెంటనే బెంగళరూరు జైలు నుంచి బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించింది. అయితే దర్శన్ విజ్ఞప్తి మేరకు ఆయనకు టీవీ సదుపాయాన్ని కల్పించింది. మరోవైపు రేణుకాస్వామి హత్య కేసును పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. హత్య సమయంలో దర్శన్ వాడిన దుస్తులు, షూ, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 231 సాక్ష్యాలతో న్యాయస్థానంలో 3,991 పేజీల ఛార్జీషీటును దాఖలు చేశారు పోలీసులు.

శుక్రవారం దర్శన్‌ని ఆయన సతీమని విజయలక్ష్మీ, సోదరుడు దినకర్ కలిశారు. ప్రత్యేక భద్రత మధ్య బ్యారక్ నుంచి ఆయనను బయటికి తీసుకొచ్చారు అధికారులు. ఈ సమయంలో దర్శన్ ప్రవర్తన మరోసారి చర్చనీయాంశమైంది. బయటకొస్తూ మీడియాకు మిడిల్ ఫింగర్ చూపిస్తూ నడుచుకుంటూ వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. జైలుకెళ్లినా కొవ్వు తగ్గలేదంటూ ఫైర్ అవుతున్నారు.

More from Filmibeat

Read more about: darshan thoogudeepa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X