Don't Miss!
- Finance
India to borrow: రికార్డు స్థాయిలో ఇండియా అప్పులు.. మోడీ పాలనలో ఎంత పెరిగాయంటే ?
- News
Lady: రైలులో ఏసీ బోగిలో మహిళ మీద ఫ్రెండ్ తో కలిసి గ్యాంగ్ రేప్ చేసిన టికెట్ ఇన్స్ పెక్టర్, కూల్ డ్రింక్ లో!
- Sports
అందుకే రోహిత్, కోహ్లీలను టీ20లకు దూరం పెట్టాం: రాహుల్ ద్రవిడ్
- Lifestyle
మీ భర్త మీతో కంటే ఫ్రెండ్స్‌తోనే ఎక్కువ టైం గడుపుతున్నారా?
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Rashmika Mandanna కు మరోసారి షాకిచ్చిన రిషబ్ శెట్టి.. ముదురుతున్న కాంతార వివాదం!
కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. కంతార రిలీజ్ తర్వాత రష్మికపై రిషబ్ శెట్టి చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత రష్మిక స్పందించిన తీరు వివాదానికి ఆజ్యం పోసింది. అయితే తాజాగా రష్మికను రిషబ్ శెట్టి మరోసారి విస్మరించడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఇటీవల కిరిక్ పార్టీ సినిమాకు సంబంధించిన ఫోటోలను రిషబ్ శెట్టి పోస్టు చేసిన తర్వాత నెటిజన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఆ వైరల్ కామెంట్ల వివరాల్లోకి వెళితే..

కిరిక్ పార్టీ ద్వారా రష్మిక మందన్నకు ఆఫర్
కన్నడ చిత్ర పరిశ్రమలో కిరిక్ పార్టీ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. కిరిక్ పార్టీ చిత్రం ద్వారా దర్శకుడిగా మారిన రిషబ్ శెట్టి.. తన తొలి చిత్రంలో రష్మిక మందన్నకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా తర్వాత రష్మికకు దక్షిణాదిలో మంచి పాపులారిటీ సంపాదించుకొన్నది. ఆ తర్వాత తెలుగులో వరుస విజయాలను సొంతం చేసుకొని బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.

కాంతార చూడలేదంటూ రష్మిక
అయితే కాంతార సినిమా రిలీజ్ తర్వాత ముంబైలో మీడియాతో మాట్లాడుతూ.. కాంతార సినిమా విషయం తెలియదు. నేను ఇంకా ఆ సినిమాను చూడలేదు అని చెప్పింది. దాంతో రిషబ్ శెట్టితో కొనసాగుతున్న అభిప్రాయ బేధాల కారణంగానే రష్మిక ఇలా మాట్లాడి ఉంటుందనే విషయం మీడియాలో హైలెట్ అయింది.
అయితే కాంతార సినిమా రిలీజైన రెండు, మూడు రోజుల తర్వాత అడిగితే.. చూడలేదని చెప్పాను. అప్పుడు నేను సినిమా చూడలేదు కాబట్టి చూడలేదని చెప్పాను. ఆ తర్వాత చూసి.. టీమ్‌కు మెసేజ్ చేశాను అని రష్మిక మందన్న తెలిపారు.

రష్మిక కంటే సమంత ఇష్టం అంటూ
అయితే కాంతార సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మీకు ఏ హీరోయిన్ ఇష్టమని అడిగితే.. సమంత, మరో హీరోయిన్ పేరును ప్రస్తావించారు. రష్మిక పేరును చెప్పడానికి ఇష్టపడకపోగా.. అలాంటి హీరోయిన్లంటే తనకు ఇష్టం లేదని చెప్పారు. మూలాలను మరిచిపోయిన వ్యక్తి గురించి ఏం మాట్లాడాలని రష్మిక గురించి మాట్లాడటానికి ఓ సందర్భంలో నిరాకరించారు.

కన్నడ సినిమాలో రష్మికపై బ్యాన్
ఇక ప్రస్తుతం కన్నడ సినిమా పరిశ్రమలో రష్మిక మందన్నపై నిషేధం విధించారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో అవకాశాలు రావడంతో కన్నడ సినిమా పరిశ్రమను మరిచిపోయింది. తనకు జీవితాన్ని ప్రసాదించిన కన్నడ భాష సినిమా రంగానికి దూరమైంది అనే విమర్శలు భారీగా వినిపిస్తున్నాయి. అయితే రష్మికపై నిషేధం రూమర్లు మాత్రమే. అందులో వాస్తవం లేదని మీరో కిచ్చ సుదీప్ తెలిపారు.
|
కిరిక్ పార్టీ పోస్టుతో మరో వివాదం
అయితే ఇదిలా ఉండగా, రిషబ్ శెట్టి తన తొలి చిత్రం కిరిక్ పార్టీ సినిమా 6 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా ట్విట్టర్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఆ ఫోటోల్లో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్న ఫోటో లేకపోవడంతో నెటిజన్లు భారీగా స్పందించారు. ఆ హీరోయిన్ లేకుండా ఫోటోలు బాగున్నాయి? హీరోయిన్ ఫోటో ఒక్కటి కూడా లేదే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ పోస్టుపై రష్మిక మందన్న ఎలా స్పందిస్తూ వేచి చూడాల్సిందే.