twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ నిర్మాత హాస్పిటల్‌లో చేరిక.. స్టార్‌ హీరోయిన్‌తో కలిసిన తర్వాత కరోనా? ఆ సీఎంతో భేటీ

    |

    ప్రముఖ నిర్మాత రాక్‌‌లైన్ వెంకటేష్‌కు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో బెంగళూరులోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. ఆయనకు కరోనావైరస్ నిర్దారణ పరీక్షలు జరిపించి ప్రస్తుతం ప్రాథమిక చికిత్సను అందిస్తున్నట్టు సమాచారం. కరోనావైరస్ రిపోర్టుల కోసం కుటుంబ సభ్యులు వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు సమాచారాన్ని వెల్లడిస్తూ..

    శ్వాస సంబంధిత సమస్యలతో

    శ్వాస సంబంధిత సమస్యలతో

    రాక్‌లైన్ వెంకటేష్‌కు రెండ్రోజుల నుంచి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తాయి. దాంతో శ్వాస పీల్చకోవడమనే సమస్య తీవ్రతరం కావడంతో ఆయనను హాస్పిటల్‌లో చేర్పించారు. వైద్యుడైన ఆయన కుమారుడే స్వయంగా చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

    ఎంపీ సుమలతను కలిసిన తర్వాత

    ఎంపీ సుమలతను కలిసిన తర్వాత

    రాక్‌లైన్ వెంకటేష్ హాస్పిటల్‌లో చేరిన తర్వాత కన్నడ మీడియాలో పలు కథనాలు ప్రచారం అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఎంపీ, సినీ నటి సుమలత అంబరీష్‌ను కలుసుకొన్నారు. ఆ తర్వాత ఆమెకు కరోనావైరస్ పాజిటివ్ అనే రిపోర్టులు వచ్చాయి. ప్రస్తుతం ఆమె క్వారంటైన్‌లో ఉన్నారు. ఆమెను కలుసుకోవడం వల్లే వెంకటేష్‌కు కరోనావైరస్ వచ్చిందా? అనే కోణంలో కథనాలను ప్రచురించారు.

    సీఎంతో భేటీ కూడా

    సీఎంతో భేటీ కూడా

    ఇది ఇలా ఉంటే.. రాక్‌లైన్ వెంకటేష్ కొద్ది రోజుల క్రితం కర్ణాటక సీఎం బీఎస్ యాడ్యూరప్పను కూడా కలిశారు. ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ అంబరీష్ స్మారక భవన నిర్మాణం కోసం సీఎంతో భేటీ అయ్యారు. ఇలాంటి క్రమంలో రాక్‌లైన్ వెంకటేష్‌కు శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తాయి. అయితే కరోనా పాజిటివా? లేదా అనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. అయితే ఆయన త్వరగా కోలుకోవాలని సన్నిహితులు, స్నేహితులు ఆకాంక్షిస్తున్నారు.

    Recommended Video

    Daggubati Ramanaidu 85th Birth Anniversary| Daggubati Abhiram Spoke About His Entry To screen
    కన్నడతోపాటు పలు భాషల్లో సినిమాలు

    కన్నడతోపాటు పలు భాషల్లో సినిమాలు

    రాక్‌లైన్ వెంకటేష్ విషయానికి వస్తే.. కన్నడ, తెలుగు, తమిళ, బెంగాళీ, హిందీ పరిశ్రమల్లో సినిమాలు రూపొందిస్తున్నారు. పోలీస్ స్టోరి, కిల్లింగ్ వీరప్పన్, నాచియార్ లాంటి సినిమాలు అత్యంత ప్రేక్షకాదరణ పొందాయి. తెలుగులో పవర్, ఆటగదరా శివ, తమిళంలో లింగా, హిందీలో భజ్‌రంగీ భాయ్‌జాన్ లాంటి చిత్రాలను రూపొందించారు.

    English summary
    Rockline Venkatesh hospitalised after complaining of breathlessness. He was joined in a hospital in bangalore, which his son treating to illness. Rockline Venkatesh produced many films in Telugu, Tamil, Kannada and Hindi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X