ఆర్టీవో అధికారితో హోటల్‌లో హీరోయిన్.. బీర్ బాటిల్‌తో మాజీ ప్రియుడు దాడి!
కన్నడ నటి రాగిణి ద్వివేది తాజాగా వార్తల్లో నిలిచింది. పలు కన్నడ చిత్రాల్లో ఈ 28 ఏళ్ల హీరోయిన్ నటించింది. రాగిణి ద్వివేది నటించిన ఏకైక తెలుగు చిత్రం జెండాపై కపిరాజు. రాగిణి కోసం ఆమె ఇద్దరు బాయ్ ఫ్రెండ్ ఒకరిపై ఒకరు పరస్పర దాడికి దిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాగిణి ప్రస్తుతం పలు కన్నడ చిత్రాలతో బిజీగా ఉంది. రాగిణి ప్రస్తుతం బెంగుళూరుకు చెందిన ఆర్టీవో అధికారి రవితో ప్రేమలో ఉంది. వీరిద్దరూ ఇటీవల ఓ హోటల్ కు వెళ్లగా ఊహించని ఘటన చోటుచేసుకుంది.

ప్రియుడితో హోటల్‌కు
రాగిణి ద్వివేది, ఆమె ప్రియుడు రవి ఇద్దరూ కలసి రిట్జ్ కార్టన్ అనే హోటల్‌కు వెళ్లారు. రవి ఆర్టీవో శాఖలో అధికారిగా పనిచేస్తున్నాడు. అనుకోకుండా ఏర్పడే వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ హోటల్‌కు వెళ్లిన సమయంలోనే అక్కడ రాగిణి మాజీ ప్రియుడు శివ ప్రకాష్ కూడా ఉన్నాడు. శివప్రకాష్ తన స్నేహితులతో పార్టీ చేసుకునేందుకు ఆ హోటల్ కు వచ్చినట్లు తెలుస్తోంది. రాగిణి, శివప్రకాష్ ఒకరికొకరు ఎదురు కావడంతో వివాదం మొదలైనట్లు తెలుస్తోంది.

బీర్ బాటిల్‌తో దాడి
రాగిణిని వేరే వ్యక్తితో చూడగానే శివ ప్రకాష్ తీవ్ర ఆవేశానికి గురయ్యాడు. హోటల్ లో రాగిణితో వాగ్వాదానికి దిగాడు. దీనితో శివ ప్రకాష్‌ని రవి అడ్డుకునేందుకు ప్రయత్నించగా పరిస్థితి చేయిదాటినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. శివ ప్రకాష్ బీర్ బాటిల్‌తో రవిపై దాడికి ప్రయత్నించాడు. హోటల్ సిబ్బంది అడ్డుకోవడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.

మరోమారు కనిపిస్తే
ఈ ఘటనపై రవి, రాగిణి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మరోమారు కనిపిస్తే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని రాగిణి పోలీస్ ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని హోటల్ సిసి టివిలో రికార్డ్ అయిన గొడవ దృశ్యాలని పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ గొడవకు సంబంధించిన మరో అనుమానాస్పద విషయం వెలుగులోకి వచ్చింది.

బెదిరించిన భార్య
రవికి ఆల్రెడీ పెళ్లయింది. అయినా కూడా రాగిణి అతడిని ప్రేమిస్తోంది. వీరిద్దరూ కలసి హోటల్ కు వెళ్ళడానికి కొద్దిసేపటి ముందు రవికి అతడి భార్య ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. నువ్వు రాగిణితో తిరుగుతున్నావనే విషయం నాకు తెలుసు. నీ వల్ల నా జీవితం నాశనం అయింది. మీరిద్దరూ ప్రస్తుతం ఎక్కడున్నారో కూడా నాకు తెలుసు. చూస్తూ ఉండి నువ్వు ఉన్న చోటికే వచ్చి నిన్ను ఎవరో ఒకరు కొడతారు. నీకు తగిన బుద్ది చెబుతారు అని రవి భార్య ఫోన్ లో బెదిరించినట్లు తెలుస్తోంది. ఆమె ఫోన్ చేసిన కొద్దిసేపటికే శివ ప్రకాష్ రవిపై దాడికి ప్రయత్నించడం అనుమానంగా మారింది.


Click it and Unblock the Notifications











