Don't Miss!
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- News పోటీ నుంచి తప్పుకున్న శ్రీరాములు భార్య, రంగంలోకి గాలి జనార్దన్ రెడ్డి, వార్ వన్ సైడ్ కాదు, పోటీ !
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
సంపూ 2 లక్షలు ఇచ్చారు.. బాధితులకు మీరేం ఇచ్చారు.. ప్రభాస్‌కు రిపోర్టర్ ఝలక్
ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన 'సాహో' ఆగస్టు 30న విడుదలవుతున్న నేపథ్యంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వివిధ రాష్ట్రాలు తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. శుక్రవారం ఆయన బెంగుళూరులో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చారు.
మీ పెదనాన్న కృష్ణం రాజుగారు చాలా డివోషనల్ మూవీస్ చేశారు. మీ నుంచి భక్త కన్నప్ప లాంటి మూవీస్ ఆశించవచ్చా? అనే ప్రశ్నకు ప్రభాస్ రియాక్ట్ అవుతూ.... 'తప్పకుండా చేస్తాను, భక్త కన్నప్ప కన్నడలో మొదట వచ్చింది. రాజ్ కుమార్ సర్ చేశారు. తెలుగులో బాపుగారు డైరెక్టర్ చేసిన భక్త కన్నప్ప నా ఫేవరెట్ ఫిల్మ్. తప్పకుండా అలాంటి సినిమాలు చేస్తాను.' అన్నారు.
బాహుబలి తర్వాత లవ్ స్టోరీ చేయాలనుకున్నాను, కానీ...
బాహుబలి తర్వాత లవ్ స్టోరీ చేయాలనుకున్నాను. కానీ స్క్రిప్టు కదరలేదు. సుజీత్ చెప్పిన స్క్రిప్టు నచ్చడంతో ‘సాహో' చేశాను. బాహుబలి తర్వాత ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. దానికి తగిన విధంగానే ‘సాహో' క్వాలిటీగా తెరకెక్కించాం. అందుకే బడ్జెట్ కూడా ఎక్కువ అయిందని తెలిపారు.
ప్రభాస్ అన్నయ్యా... పెళ్లి ఎప్పుడు? వదిన ఎప్పుడు వస్తుంది?
మధ్యలో కొందరు లేడీ అభిమానులు మైక్ అందుకుని ప్రభాస్ అన్నయ్యా... మీ పెళ్లికి ఎప్పుడు పిలుస్తారు? వదినను మాకు ఎప్పుడు పరిచయం చేస్తారు? అనే ప్రశ్నకు రియాక్ట్ అవుతూ.... ‘తెలియదు' అంటూ నవ్వుతూ సిగ్గుమొగ్గలేశారు యంగ్ రెబల్ స్టార్.
‘సాహో' అంటే అర్థం ఏమిటి? ఎందుకు ఈ టైటిల్ పెట్టారు?
‘సాహో' అంటే అర్థం ఏమిటి? ఎందుకు ఈ టైటిల్ పెట్టారు? అని ఒకరు ప్రశ్నించగా... ‘సాహో' అనేది సంస్కృత పదం. సాహో అంటే జైహో లాంటి మీనింగ్ వస్తుంది. ఒక ఆసక్తికర విషయం చూపించబోతున్నాం కాబట్టి ఇలాంటి టైటిల్ పెట్టామని ప్రభాస్ తెలిపారు.
డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి చిన్న చిత్రాలు, ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తారా?
తప్పకుండా చేస్తాను. ఛత్రపతి తర్వాత డార్లింగ్ చేశాను, మిస్టర్ పర్ఫెక్ట్ చేశాను. సాహో తర్వాత లవ్ స్టోరీ చేయబోతున్నాను. మేము ఎప్పుడూ మంచి స్క్రిపు కోసం ఎదురు చూస్తుంటాం. అన్ని రకాల సినిమాలు చేస్తానని ప్రభాస్ తెలిపారు. ఆల్రెడీ లవ్ స్టోరీతో తర్వాతి సినిమా షూటింగ్ మొదలైంది. 20 రోజుల షూటింగ్ కూడా జరిగింది. ఇది కూడా ప్యాన్ ఇండియా సినిమా కానీ యాక్షన్ మూవీ కాదన్నారు.
బాహుబలి సమయంలో చాలా జంతువులను తిన్నాను
ఫిట్నెస్ అనేది సినిమా సినిమాకు మారుతుంది. బాహుబలి సమయంలో కండలు పెంచడానికి చాలా జంతువులను తిన్నాను. తర్వాత మజిల్స్ తగ్గించుకోవడానికి సాహో సమయంలో వెజిటేరియన్‌గా మారాను, చాలా జంతువులను సేవ్ చేశాను అని ఓ ప్రశ్నకు ప్రభాస్ సమాధానం ఇచ్చారు.
కర్నాటక వరద బాధితులకు సంపూ 2 లక్షలు ఇచ్చారు.. మరి మీరు?
సంపూర్ణేష్ బాబు నార్త్ కర్నాటక వరద బాధితులకు రూ. 2 లక్షల విరాళం ఇచ్చారు. మీకు ఇక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మీ సినిమాలు కూడా బాగా ఆడతాయి. మీరు ఎలాంటి సహాయం చేస్తారు? ఏమైనా చేశారా? అనే ప్రశ్నకు ప్రభాస్ స్పందిస్తూ... ‘‘ఐ విల్ డూ మై బెస్ట్.. తప్పకుండా చేస్తాను. ఇలాంటివి జరిగినపుడు నేను సహాయం చేస్తూనే ఉన్నాను.'' అన్నారు.
అనుష్క మ్యాటర్
అనుష్కకు, మీకు మధ్య లవ్ ఎఫైర్ ఉన్నట్లు, పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజమేనా? అని ఈ సందర్భంగా కొందరు ప్రశ్నించగా.... ఆ వార్తలు క్రియేట్ చేసింది మీరే, దానికి సమాధానం కూడా మీరే చెప్పాలి అంటూ ప్రభాస్ వ్యాఖ్యానించారు.