కేజియఫ్ సినిమాకు కోర్టు ఝలక్.. విడుదలపై అనుమానం.. స్పందించిన నిర్మాత
యశ్, శ్రీనిథి శెట్టి జంటగా నటించిన సినిమా కేజియఫ్. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం అనుకున్నట్లుగానే డిసెంబర్ 21నే విడుదల కానుందని దర్శక నిర్మాతలు తెలిపారు. తెలుగులో ఈ చిత్ర హక్కులను సాయి కొర్రపాటి తీసుకున్నారు. వారాహి చలనచిత్రం బ్యానర్ లో కేజియఫ్ సినిమాను సాయి కొర్రపాటి విడుదల చేస్తున్నారు. అయితే కేజీఎఫ్ విడుదలపై కోర్టు స్టే ఇవ్వడంపై రిలీజ్‌పై రూమర్లు వస్తుండటంతో నిర్మాత సాయి కొర్రపాటి స్పందించారు. ఆయన ఏమన్నారంటే..

కేజీఎఫ్ విడుదలపై కోర్టు స్టే
అయితే కేజీఎఫ్ సినిమా చట్టపరమైన ఇబ్బందుల్లో పడింది. కన్నడ సినిమా మూవీపై బెంగళూరు సివిల్ కోర్డు స్టే విధించింది. జనవరి 7వ తేదీ వరకు సినిమాను రిలీజ్ చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఈ సినిమా విడుదలపై నీలి మేఘాలు కమ్ముకొన్నాయి.

రౌడీ తంగమ్ జీవితం ఆధారంగా
కర్నాటకలోని తంగమ్ అనే రౌడీ జీవిత కథతో కేజీఎఫ్ తెరకెక్కినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ రౌడీకి సంబంధించిన జీవితం ఆధారంగా బయోపిక్‌ను తీసేందుకు హక్కులు తనకు ఉన్నాయని వెంకటేష్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కోర్టు ఈ సినిమా విడుదలపై స్టే విధించింది.

సాయి కొర్రపాటి ఖండన
అనివార్య కారణాలతో కేజియఫ్ సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం లేదని.. డిసెంబర్ 21 నుంచి ఈ చిత్రం వాయిదా పడిందని వస్తున్న వార్తలను నిర్మాత సాయి కొర్రపాటి ఖండించారు. ఈ చిత్రం అనుకున్న సమయానికి.. అనుకున్నట్లుగా విడుదల అవుతుందని తెలిపారు.

పలు భాషల్లో కేజీఎఫ్ రిలీజ్
డిసెంబర్ 21న తెలుగుతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల అవుతున్నది. కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా బారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











