సాయి పల్లవి ఫోన్ నెంబర్.. 1 కోటి డిమాండ్.. పెద్ద ట్విస్టే తగిలిందిగా

ఇటీవల సోషల్ మీడియా సహా సినీ వర్గాల్లో మంచి హాట్ టాపిక్ గా నిలిచిన పలువురు ప్రముఖ యంగ్ హీరోయిన్స్ లో కొందరు తమ గ్లామరస్ రోల్స్ అండ్ పాటలతో వైరల్ అయితే ఒక్క హీరోయిన్ మాత్రం తన పెర్ఫామెన్స్, పలు కాంట్రవర్సియల్ కామెంట్స్ తో వైరల్ అయ్యింది. మరి ఈ రెండో రకం హీరోయినే నాచురల్ బ్యూటీ సాయి పల్లవి. తాను నటించిన లేటెస్ట్ చిత్రం "అమరన్" తమిళ నాట భారీ వసూళ్లు రాబట్టింది.

యువ హీరో శివ కార్తికేయన్ తో దర్శకుడు పెరియసామి తీసిన ఈ ఎమోషనల్ యాక్షన్ బయోపిక్ చిత్రం భారీ హిట్ అయ్యి ఏకంగా రూ.300 కోట్లకి పైగా వసూళ్లు అందుకుంది. ఇన్ని లాభాలు అందించిన ఈ సినిమా విషయంలో పలు అసహనాలు కూడా లేకపోలేవు. ఈ రెండు రోజుల్లోనే మేకర్స్ సాయి పల్లవిని సినిమా విడుదల తర్వాత పక్కన పెట్టేసారు అని పలు కామెంట్స్ నెటిజన్స్ సహా సినీ ప్రముఖులు నుంచి వచ్చాయి. అయితే వీటి కంటే ముందు ఓ షాకింగ్ ట్విస్ట్ ఈ సినిమా విషయంలో చోటు చేసుకుంది.

sai pallavi phone number original owner demanding huge to amaran makers

ఈ సినిమాలో ఓ సీన్ లో సాయి పల్లవి తన నెంబర్ చూపించే సన్నివేశం ఉంటుంది. దీనితో ఈ సీన్ చూసిన జనం అంతా అది సాయి పల్లవి నెంబర్ అనుకొనే ఫోన్స్ చేయడం మొదలు పెట్టడంతో తమిళనాట విగ్నేష్ అనే ఇంజినీరింగ్ విద్యార్ధి విస్తుపోయాడు. దీనితో ఈ సినిమాలో తన నెంబర్ పెట్టడం మూలాన వచ్చిన కాల్స్ తో విసిగిపోయి చిత్ర యూనిట్ పై కేసు కూడా వేసాడట.

ఇక దీనిలో లేటెస్ట్ ట్విస్ట్ ఏమిటంటే తనకి 1.1 కోటి రూపాయలు పరిహారంగా చెల్లించాలి అని చిత్ర యూనిట్ ని న్యాయస్థానం ద్వారా డిమాండ్ చేస్తున్నాడట. తన నెంబర్ ఆ సినిమాలో పెట్టడం మూలాన మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాను అని తెలిపాడు. ముఖ్యంగా సాయి పల్లవి అభిమానులు అంటూ చాలా కాల్స్ నాకు వచ్చాయని వీటితో చాలా ఇబ్బంది పడ్డాను అందుకే నాకు 1.1 కోటి రూపాయలు చిత్ర యూనిట్ చెల్లించాల్సిందే అంటూ కోర్టులో కేసు వేసాడట.

sai pallavi phone number original owner demanding huge to amaran makers

దీనితో ఈ అంశం మేకర్స్ కి ఊహించని టర్న్ గా మారింది అని చెప్పాలి. ఆల్రెడీ అమరన్ సినిమా భారీ లాభాలు అందుకుంది. చేసిన పొరపాటుకు పరిహారంగా ఆ యువ స్టూడెంట్ కి ఆ మొత్తాన్ని చెల్లిస్తారో లేదో అనేది చూడాలి. ఇలా మొత్తానికి అయితే సాయి పల్లవి నెంబర్ కొంప ముంచింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా విషయం పక్కన పెడితే సాయి పల్లవి తెలుగులో నాగ చైతన్యతో రెండో సారి సినిమా చేస్తుండగా , హిందీలో రణబీర్ కపూర్ తో "రామాయణం" చేస్తుంది.

More from Filmibeat

Read more about: sai pallavi amaran ramayan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X