సలార్ ఒరిజినల్ హీరోకి షాకిచ్చిన ప్రశాంత్ నీల్
ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమా దగ్గర మంచి హైప్ నడుమ రిలీజ్ కి వచ్చిన సినిమాల లిస్ట్ తీస్తే అందులో డెఫినెట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు లేకుండా ఉండవు. కాగా గత ఏడాదిలోనే తన నుంచి రెండు సినిమాలు వచ్చాయి. అలాగే ఈ ఏడాదిలో ఓ సినిమా వచ్చింది. మరి తన సినిమాలకి ఒకో టాక్ తో ఒకో వసూళ్లు వస్తాయని చెప్పొచ్చు.
ప్లాప్ టాక్ వస్తే మినిమమ్ 200 కోట్లు, ఓకే హిట్ టాక్ అలా పడితే ఈజీగా 500 కోట్లు ప్లస్ వసూళ్లు ఇక బ్లాక్ బస్టర్ పడితే 1000 కోట్లు ఖాయం అని తన గత మూడు సినిమాలతో తేలిపోయింది. కాగా ప్రభాస్ నటించిన ఈ మూడు సినిమాల్లో ఓ సినిమా రీమేక్ అని చాలా మందిని ఆ మధ్య కన్ఫ్యూజన్ లో నెట్టేసింది. కాగా అంతలా దాచిన సినిమానే "సలార్".

దర్శకుడు ప్రశాంత్ నీల్ కెరీర్ ను మొదలు పెట్టిన సినిమా తనకి కేజీయఫ్ సహా ఏ సినిమా కంటే కూడా ఎక్కువ ఇష్టమైన సినిమా "ఉగ్రం" కి రీమేక్ గా తెలుగులో భారీ బడ్జెట్ తో అనేక మార్పులు చేసి వరల్డ్ క్లాస్ లెవెల్లో తెరకెక్కించారు. అయితే కన్నడలో హీరో శ్రీమురళి నటించిన ఈ సినిమా 2014లో విడుదల అయ్యి కన్నడలో సంచలన విజయం సాధించింది.
కానీ అయినప్పటికీ ప్రశాంత్ నీల్ లో ఏదో అసంతృప్తి మిగిలిపోయిందట. దీనితో దానికి అడ్వాన్స్ వెర్షన్ లా కేజీయఫ్ లాంటి పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న తర్వాత ప్రభాస్ తో అనౌన్స్ చేసిన సినిమానే "సలార్". మరి ఈ సినిమా అనౌన్సమెంట్ పోస్టర్ చూసినప్పుడే చాలా మంది ఇది ఉగ్రం రీమేక్ అన్నారు. అంతే కాకుండా సంగీత దర్శకుడు రవి బాస్రుర్ కూడా ఓ ఇంటర్వ్యూలో సలార్ ఉగ్రం కి రీమేక్ అని చెప్పడం కూడా వైరల్ అయ్యింది.

అయితే దీనిని ఎలాగో సినిమా రిలీజ్ వరకు మేకర్స్ ఒరిజినల్ అంటూనే నెట్టుకుంటూ వచ్చారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక దాదాపు అన్ని కీలక సీన్స్ కూడా ఉగ్రం లో అచ్చు గుద్దినట్టు ఉన్నాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే సలార్ ఒరిజినల్ హీరోకి తన సినిమా రీమేక్ చేసారని తెలియనే తెలీదట. కాగా తన బఘీర ప్రమోషన్స్ లో శ్రీమురళి ఈ విషయం చెప్పాడు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో చేస్తున్న సలార్ సినిమా తన ఉగ్రం రీమేకే అని విడుదల అయ్యేవరకు కూడా తెలియదని అసలు విషయం చెప్పాడు.
దీనితో ఈ సినిమాని అసలు ఒరిజినల్ హీరోకి కూడా తెలియకుండా తీసేయడం ఒకింత ఆశ్చర్యకరమే అని చెప్పాలి. అయితే ఇపుడు నీల్ అండ్ కో రెబల్ స్టార్ తో సలార్ పార్ట్ 2 తో బిజీగా ఉండగా శ్రీమురళితో ఉగ్రం 2 చేయకుండానే డైరెక్ట్ గా సలార్ 2 ని చేసేస్తున్నారు. సో ఈ ఫ్రాంచైజ్ ని ప్రభాస్ కి అంకితం చేసేసినట్టే అనుకోవాలి. కాగా మరోపక్క శ్రీమురళి తన బఘీర రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి కథ ప్రశాంత్ నీలే అందించగా ఈ దీపావళి కానుకగా కన్నడ సహా తెలుగులో విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











