Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అప్పుడు మీ అమ్మ కూడా హాట్‌గా ఉందా? సిగ్గనిపించడం లేదా... నెటిజన్‌కు సమీరారెడ్డి షాక్
దక్షిణాది హీరోయిన్ సమీరా రెడ్డి రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. తను ప్రెగ్నెంట్ అని చెబుతూ ఇటీవల ఓ సెల్ఫీ ఫొటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే కొందరు నెటిజన్లు ఆమె శరీరాకృతిని టార్గెట్ చేసుకొని దారుణమైన కామెంట్లు వదిలారు. వాటికి సమాధానం ఇస్తూ ప్రెగ్నెంట్ సమయంలో కరీనా కపూర్ మాదిరిగా అందరూ అందంగా ఉండరు అని సమీరా కామెంట్ చేసింది. అయినా తనపై ట్రోల్ చేస్తుండటంతో సమీరా రెడ్డి ఘాటుగా స్పందించారు. సమీరా ఏమన్నారంటే..
ట్రోలర్స్‌పై సమీరారెడ్డి కామెంట్
నన్ను కామెంట్ చేసిన ట్రోలర్స్ నుంచి ఓ విషయం అడుగాలని అనుకొంటున్నాను. మీ జన్మకు కారణం ఏమిటి? మీరు మీ తల్లి గర్భం నుంచే వచ్చారు కదా? నీవు పుట్టినప్పుడు మీ తల్లి చాలా హాట్‌గా ఉందా? మీ లాంటి వారిని చూస్తే సిగ్గుతో తలవంచుకోవాల్సి వస్తున్నది అని సమీరా ఘాటుగా స్పందించింది.
మాతృత్వం నీకు గురించి తెలుసా?
ఓ బిడ్డకు మహిళ జన్మనివ్వడం అద్భుతమైన ఫీలింగ్. అది సృష్టికి సంబంధించిన గొప్ప విషయం. అలాంటి గొప్ప ఫీలింగ్ కలుగజేసే విషయాలను వదలకుండా ట్రోల్ చేస్తారా? మీకు తల్లి, సోదరి లాంటి ఉన్నారు కదా? వారిని కూడా ఇలానే అంటారా అని సమీరా దుమ్ము దులిపింది.
బిడ్డకు తల్లైతే.. అందంగా ఉంటారా?
తల్లిగా మారిన తర్వాత అందంగా కనిపించడం కొందరికే సాధ్యమవుతుంది. కరీనా లాంటి వాళ్లే హాట్‌గా కనిపిస్తారు. నాలాంటి వాళ్లకు అందంగా కనిపిస్తే ఏం జరుగుతుంది. మళ్లీ నేను అందంగా కనిపించాలంటే కాస్త సమయం పడుతుంది. దానికి ఇప్పుడు తొందరేమీ లేదు అని సమీరా పేర్కొన్నది.
అందం గురించి ఆలోచించడం లేదు
మొదటి కాన్పు తర్వాత రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నాను. ఆ సమయంలో పిల్లల గురించే ఆలోచించాలి గానీ అందం గురించి ఆలోచించవద్దు అని సమీరా ధీటైన జవాబిచ్చింది. అందంగా, హాట్ కనిపించడం పెద్ద సమస్యేమీ కాదు. కానీ నేనిప్పుడు చాలా ప్రశాంతంగా, రిలాక్స్డ్గా ఉన్నాను. మరో బిడ్డకు జన్మనిచ్చే ఆలోచనలతోనే గడుతున్నాను అని సమీరా చెప్పింది.
చివరిసారిగా సమీరారెడ్డి
కెరీర్ మంచి జోష్‌లో ఉండగానే ఆకాష్ వర్దేను సమీరారెడ్డి వివాహం చేసుకొన్నారు. వారికి మూడేళ్ల వయసు ఉన్న ఆకాశ్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం జూలైలో రెండో బిడ్డకు సమీరా జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె చివరిసారిగా 2013లో వరదనాయక అనే చిత్రంలో కనిపించారు.