నా తల్లిదండ్రుల పరిస్థితి విషమంగా.. ప్రాణాలు కాపాడండి.. సోషల్ మీడియాలో యువ హీరోయిన్ మొర
దేశవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్య పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రజలు భయంతో బతుకును కొనసాగిస్తున్నారు. సాధారణ ప్రజలు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా కరోనావైరస్ ప్రజలను వెంటాడుతున్నది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కన్నడ యువ హీరోయిన్, కిరిక్ పార్టీ ఫేమ్ సంయుక్త హెగ్డే ఆక్రందన అందర్నీ ఆవేదనకు గురిచేసింది. ఆ వివరాల్లోకి వెళితే...

సెకండ్ వేవ్‌తో కష్టాలు
హీరోయిన్ సంయుక్త హెగ్డే తన తల్లిదండ్రులతో కలిసి బెంగళూరులో నివాసం ఉంటున్నారు. కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఆమె తల్లిదండ్రులు కరోనావైరస్ బారిన పడ్డారు. దాంతో తన తల్లిదండ్రులకు చికిత్స చేయించేందుకు కష్టాలు పడుతున్నారని ఆమె చేసిన పోస్టుతో స్పష్టమైంది.

నా పేరెంట్స్‌కు కరోనావైరస్
నా తల్లిదండ్రులకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. వారి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. వారికి అవసరమైన రెమ్డేసివిర్ ఇంజెక్షన్ కావాలి. ఎవరైనా సహాయం చేయండి అంటూ ట్విట్టర్‌లో సంయుక్త హెగ్డే ట్వీట్ చేశారు.

రెమ్డేసివిర్ ఇంజెక్షన్ కావాలి..
నా తల్లిదండ్రులకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. నా తండ్రికి అత్యవసరంగా రెమ్డేసివిర్ ఇంజెక్షన్ వేయించాల్సి ఉంది. నా మొబైల్ కాంటాక్టులో ఉన్న వారందరికీ ఫోన్ చేశాను. కానీ ఎలాంటి సహకారం అందలేదు. నా తండ్రికి ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నాం. హాస్పిటల్‌కు వెళ్లడానికి ఆయన ఆసక్తి చూపడం లేదు. నాకు ఆరు రెమ్డేసివిర్ ఇంజెక్షన్లు కావాలి అంటూ సంయుక్త హెగ్డే ట్వీట్‌లో పేర్కొన్నారు.

100 నంబర్లకు ఫోన్ చేయలేను
నా తల్లిదండ్రులకు ఇంటిలోనే ఇంజెక్షన్లు ఇచ్చే విధంగా ఎదైనా ఉంటే వెంటనే నాకు డైరెక్ట్ మెసేజ్ ద్వారా డాక్టర్లు, ఇంజెక్షన్ల లభ్యత గురించి సమాచారం అందించండి. 100 నంబర్లకు ఫోన్ చేయడం ఈ పరిస్థితుల్లో కష్టం. దయచేసి సహాయం చేయండి అంటూ దీనంగా ప్రార్థించింది.
Recommended Video

సంయుక్త హెగ్డే కెరీర్ ఇలా..
సంయుక్త హెగ్డే కెరీర్ విషయానికి వస్తే.. 2016లో కిరిక్ పార్టీ చిత్రం ద్వారా కన్నడ సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది. ఆ తర్వాత కాలేజ్ కుమార్, కిరాక్ పార్టీ, వాచ్‌మెన్, కోమలి, పప్పీ లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళలంలో థీల్, కన్నడలో తురత్తు నిర్గమన అనే చిత్రాల్లో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











