కారు ప్రమాదంలో కన్నడ హీరో దర్శన్‌కు తీవ్రగాయాలు

బెంగుళూరులో జరిగిన కారు ప్రమాదంలో ప్రముఖ సాండల్‌వుడ్ స్టార్ దర్శన్, సినీయర్ కన్నడ నటుడు దేవరాజ్, దేవరాజ్ కుమారుడు ప్రజ్వల్, మరొకరు గాయపడ్డారు. సోమవారం తెల్లవారుఝామున హింకల్ రింగ్ రోడ్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని వెంటనే బెంగుళూరులోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో దర్శన్ ముంజేయికి ఫ్యాక్చర్ అయినట్లు తెలుస్తోంది. నటుడు దేవరాజ్ చాతీకి ఎడమ భాగంలో తీవ్రగాయమైంది. ప్రజ్వల్, మరొక వ్యక్తి మెడ భాగంలో దెబ్బలు తగిలాయి. అయితే ఈ నలుగురికి ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు.

Sandalwood actor Darshan injured in Car accident

ఈ ప్రమాదానికి కారణం వారు ప్రయాణిస్తున్న కారు పంచ్ అవ్వడం వల్ల వాహనం కంట్రోల్ తప్పడమే అని తెలుస్తోంది. దర్శన్‌కు ముంజేయికి ఫ్యాక్చర్ కావడం వల్ల అతడి ఐసీఓ ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఈ నలుగురు బెంగుళూరులోని ఓ హోటల్‌లో జరిగిన ప్రైవేట్ ఫంక్షన్‌కు హాజరై తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే దర్శన్ తల్లి మీనా, భార్య విజయ లక్ష్మి ఆసుపత్రికి చేరుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X