కేజీయఫ్ 2: అధీరా వచ్చేస్తున్నాడు
బాలీవుడ్ మున్నాభాయ్ 'కేజీయఫ్ 2' లో అధీరా పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగులో సమయంలోనే సంజయ్ అనారోగ్యం పాలవ్వడం, చికిత్స నిమిత్తం విదేశాలకు పయనమవ్వడం చకచకా జరిగిపోయాయి.
ఆ సమయంలోనే అతడు ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు గుర్తించి చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన సంజూ ఇక షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. చికిత్స తీసుకుంటూనే చిత్రీకరణలో పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నాడు.

అధీరా లుక్ లోకి మారేందుకు సిద్ధమైన సంజూకు బాలీవుడ్ ఫేమస్ హైర్ స్టయిలిష్ట్ ఆలిం హకీమ్ పాత్రకు అనుగుణంగా లుక్ మార్చారు. ప్రస్తుతం ఈ లుక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. దీనిపై హీరో యశ్ స్పందిస్తూ ..'నిజమైన యోధుడిని ఎవరూ ఆపలేదు' అని రాసుకొచ్చాడు.
నవంబర్‌లో సంజయ్ దత్ 'కేజీఎఫ్ 2' లొకేషన్‌లో అడుగు పెట్టనున్నాడు. దాదాపు నెల రోజులపాటు ఆయన పాత్రకి సంబంధించిన షూటింగ్ ఉంటుందని సమాచారం.


Click it and Unblock the Notifications











