నాకు 386 గర్ల్‌ఫ్రెండ్స్.. కానీ ఆయన కంటే తక్కువే.. సంజయ్ దత్
కన్నడలో ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత కే వెంకట రమణ (కేవీఎన్) నిర్మాణ సారథ్యంలో దర్శకుడు ప్రేమ్ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం కేడీ (కాళిదాస). ఈ సినిమాలో యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా, సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి, రేష్మా నానయ్య, వీ రవిచంద్రన్, రమేశ్ అరవింద్, రమేశ్ అరవింద్, యష్ శెట్టి తదితరుల నటించారు. ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించారు. ముంబై, హైదరాబాద్, చెన్నై, కోచి, బెంగళూరు నగరాల్లో వివిధ భాషల్లో ట్రైలర్ ఆవిష్కరించారు. బెంగళూరులో జరిగిన టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంజయ్ దత్ మాట్లాడుతూ..
నా జీవితంలో నాకు 384 మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారని నేను గర్వంగా ఫీలయ్యే వాడిని. కానీ నిర్మాత కే వెంకట రమణతో మాట్లాడిన తర్వాత నాకు జెలసీగా ఉంది. ఇన్నాళ్లు నాకే ఎక్కువ మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని ఫీలయ్యే వాడిని. కానీ నన్ను మంచి హీరో రవిచంద్రన్ సార్‌కు ఎక్కువ ఉన్నారని తెలిసింది. ఆయన ఎంతో మంది బ్యూటీఫుల్ హీరోయిన్స్‌ను కన్నడ ఇండస్ట్రీకి పరిచయం చేశారని తెలిసి చాలా హర్ట్ అయ్యాను. ఆయనలో అంత మ్యాజిక్ ఉంది. రవి చంద్రన్ సార్ నుంచి కొన్ని టిప్స్ తీసుకోంటాను అని సంజయ్ దత్ ఉల్లాసంగా మాట్లాడి అందర్నీ నవ్వుల్లో ముంచెత్తారు.

ఇక కేడీ (కాళిదాస) చిత్రంలోని నా పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ సినిమా జర్నీని ప్రతీ క్షణం ఎంజాయ్ చేశాను. ఈ క్యారెక్టర్ చాలా డేంజరస్. ఆ పాత్రకు ఓ ఫ్యామిలీ, పిల్లలు కూడా ఉంటారు. నా పాత్ర చుట్టూ అమేజింగ్ కథ ఎలా ముందుకెళ్తుందనేది సినిమా చూస్తే తెలుస్తుంది. హీరో రవిచంద్రన్, నిర్మాత వెంకీ, దర్శకుడు ప్రేమ్ కుమార్‌తో పనిచేయడం హ్యాపీగా ఉంది. నా తమ్ముడు ధ్రువ, హీరోయిన్ రేష్మాతో పనిచేయడం లక్కీగా అనిపిస్తుంది అని సంజయ్ దత్ అన్నారు.
నా కెరీర్‌లో నేను చాలా మంది సీనియర్ హీరోలతో పనిచేశాను. దిలీప్ కుమార్, అశోక్ కుమార్, అమితాబ్ బచ్చన్ లాంటి టాప్ యాక్టరల్తో వర్క్ చేశాను. అప్పుడు నాకు కలిగిన అనుభూతినే ధ్రువ ద్వారా కలిగింది. షూటింగ్‌లోను, అలాగే ఈ సినిమా జర్నీలో ధ్రువను నిశితంగా గమనిస్తున్నాను. ఏదో ఒక రోజు కన్నడ సినిమాలోనే కాదు.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా పెద్ద యాక్టర్ అవుతారు. దర్శకుడు ప్రేమ్ పేరుకు తగినట్టే చాలా ప్రేమను కురిపించాడు అని సంజయ్ దత్ అన్నారు.
కేడీ సినిమా డబ్బు కంటే ఫ్యాషన్‌కు ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ సినిమాను నిర్మాత వెంకీ చాలా ప్యాషన్‌తో తీశారు. ఏనాడు కూడా సెట్‌లో కనిపించలేదు. ఆయన సెట్‌కు చాలా తక్కువ సార్లు వచ్చి ఉంటారు. ఆయన లాంటి నిర్మాతలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి చాలా అవసరం. ఆయన నిర్మించే సినిమాల్లో మళ్లీ మళ్లీ నటించాలని కోరుకొంటున్నాను అని సంజయ్ దత్ చెప్పారు.


Click it and Unblock the Notifications











