Don't Miss!
- News కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోతే..: జగన్ నోటి వెంట జాతీయ రాజకీయాలు
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్‌గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Sports SRH ఎఫెక్ట్‌తో IPLలో కొత్త రూల్: బౌలర్లకు గుడ్ & బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
సీక్రెట్‌గా సంజన గల్రానీ పెళ్లి! డ్రగ్ కేసులో అరెస్ట్‌కు ముందే.. ఆ పరీక్షకు నో!
డ్రగ్స్ కేసులో అరెస్టైన దక్షిణాది నటి సంజన గల్రానీ డోప్ టెస్ట్ వ్యవహారం మరింత వివాదంగా మారుతున్న క్రమంలో ఆమె పెళ్లి వ్యవహారం తెరపైకి రావడం సెన్సేషనల్‌గా మారింది. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని చెప్తూ వస్తున్న కన్నడ భామ పెళ్లి ఫోటోలుగా భావిస్తున్నవి మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లిపై తల్లిదండ్రులు, ప్రియుడు, స్వయంగా ఆమె చెబుతున్న విషయాలు పొంతనలేకుండా ఉండటంతో సంజన పెళ్లి వ్యవహారం మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే పెళ్లిపై, డోప్ టెస్టు విషయంలో సంజన వాదన ఎలా ఉందంటే...
డోప్ టెస్టులు చేయించుకోనంటూ మొండిగా
డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన సంజనాకు డోప్ టెస్టులు నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే తాను డోప్ టెస్టులు చేయించుకోనంటూ మొండికేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నా లాయర్ సూచన మేరకు నడచుకొంటాను. రాజ్యాంగం కల్పించిన నా ప్రాథమిక హక్కులను కాపాడుకొంటాను. డ్రగ్ డోప్ టెస్టులకు ససేమిరా అంటూ రచ్చ చేసిన వీడియో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది.
బెంగళూరు డాక్టర్‌తో రహస్య వివాహం
ఇదిలా ఉంటే, సంజన గల్రానీ పెళ్లి విషయం ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. బెంగళూరుకు చెందిన కార్డియోవాస్కులర్ సర్జన్ డాక్టర్ అజీజ్ పాషాతో పెళ్లి జరిగినట్టు ధృవీకరిస్తున్న ఓ ఫోటో మీడియాలో వెలుగు చూసింది. అయితే కొద్దికాలంగా వారిద్దరి మధ్య చాటుమాటు వ్యవహారం సాగుతున్నదనే విషయం అడపదడపా మీడియాలో వినిపించింది.
నాకు పెళ్లి కాలేదు అంటూ సంజన క్లారిటీ
అయితే తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై సోమవారం (సెప్టెంబర్ 7న) మీడియాతో మాట్లాడుతూ నా పెళ్లి జరిగినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం. నేను పెళ్లి చేసుకోలేదనే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాను. ఇక విషయంపై ఎలాంటి రూమర్లు, గాసిప్స్‌ను నమ్మవద్దు అంటూ సంజనా క్లారిటీ ఇచ్చారు.
పెళ్లి కాలేదు కానీ.. ఎంగేజ్మెంట్
అయితే సంజన పెళ్లి విషయంలో తల్లి రేష్మా గల్రానీ చెప్పిన విషయం మరో విధంగా ఉంది. సంజనాకు పెళ్లి కాలేదు కానీ, డాక్టర్ అజీజ్ పాషాతో ఎంగేజ్మెంట్ జరిగింది. నిశ్చితార్థం కూడా మూడేళ్ల క్రితం జరిగింది. వాస్తవానికి ఏప్రిల్‌లో వారిద్దరు పెళ్లి చేసుకోవాలి. కరోనావైరస్ కారణంగా పెళ్లి వాయిదా పడిందంటూ క్లారిటీ ఇచ్చారు.
Recommended Video
పెళ్లిలో తీయించుకొన్న ఫోటో అంటూ
సంజనా, అజీజ్ పాషా పెళ్లి విషయంపై వారి సన్నిహితుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం వైరల్‌గా మారిన సంజనా పెళ్లి ఫోటో.. అజీజ్ బంధువుల పెళ్లి సందర్బంగా తీసుకొన్న ఫోటో అని తెలిపారు. అయితే పెళ్లి విషయంపై మాట్లాడటానికి ఆయన నిరాకరించడం మరింత అనుమానాలు రేకెత్తించాయి.