సంజన గల్రానీకి కష్టాలు.. డ్రగ్ రాకెట్ వ్యవహారంలో సమన్లు?. నిర్మాతపై దాడి ఘటన..

కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ మాఫియా లింక్ తీగను లాగి డొంకను కదిలించేందుకు చేస్తున్న అధికారులకు ప్రయత్నాలు సఫలమవుతున్నట్టు కనిపిస్తున్నాయి. డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నట్టు పలువురు సినీ తారలపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ హీరోయిన్ సంజనా గల్రానీ అసిస్టెంట్‌ను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. ఈ ఘటన తర్వాత సంజనకు పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉందనే మాట బలంగా వినిపిస్తున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

పార్టీలకు డ్రగ్స్ సప్లై

పార్టీలకు డ్రగ్స్ సప్లై

డ్రగ్స్ రాకెట్‌ సాగిస్తున్న దందాకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్న క్రైమ్ బ్రాంచ్ అధికారులకు సంచలన విషయాలు బయపడుతున్నాయి. సంజనా గల్రానీ అసిస్టెంట్‌ రాహుల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పుడు ఆమె పాత్ర ఏమిటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సంజనా గల్రానీ సహాయకురాలు పలు పార్టీలకు డ్రగ్స్ సప్లయి చేస్తుందనే ఆరోపణలు రావడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది.

 గతేడాది పార్టీలో దాడి ఘటన

గతేడాది పార్టీలో దాడి ఘటన

గతేడాది డిసెంబర్ 24వ తేదీన ఓ రెస్టారెంట్‌లో జరిగిన పార్టీలో దాడి ఘటనను బెంగళూరు పోలీసులు తిరగదోడే పరిస్థితి కనిపిస్తున్నది. నిర్మాత వందన జైన్‌పై దాడి చేసిన ఘటన అప్పట్లో సెన్సేషన్‌గా మారింది. డిసెంబర్ 24వ తేదీన వందనను సంజనా అల్కాహాల్ బాటిల్‌తో కొట్టడం వివాదమైంది. ఆ ఘటనలో సంజనాపై వందన జైన్ కేసు నమోదు చేయడం తెలిసిందే.

నిర్మాత వందన జైన్‌తో గొడవపై సంజనా

నిర్మాత వందన జైన్‌తో గొడవపై సంజనా

నిర్మాత వందన జైన్‌తో జరిగిన గొడవపై సంజన గల్రానీ స్పందించి క్లారిటీ ఇచ్చారు. తనను వందన అరెస్ట్ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తన కెరీర్‌ను, ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కుట్ర పన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో తనపై వస్తున్న రూమర్లను నమ్మొద్దని, ఈ ఘటనలో బెంగళూరు సిటీ పోలీసుల మద్దతిచ్చినందుకు థ్యాంక్స్ అంటూ ఆమె కామెంట్లు చేశారు.

Recommended Video

ఆ వీడియో షేర్ చేసి దొరికిపోయిన సినీనటి సంజన.. పోలీసుల నోటీసులు!!
 సంజనాకు సమన్లు జారీ చేసే ఆలోచనలో...

సంజనాకు సమన్లు జారీ చేసే ఆలోచనలో...

నిర్మాతపై దాడి సంఘటనకు డ్రగ్స్ కేసుకు ఏదైనా సంబంధముందా? అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభిస్తున్నారు. రాహుల్ అరెస్ట్ తర్వాత సంజనా గల్రానికి సమన్లు పంపించే ఆలోచనలో బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే డ్రగ్స్ మాఫియాతో సంబంధాలపై దర్శకుడు ఇంద్రజిత్ లోకేష్, హీరోయిన్ రాగిణికి సమన్లు పంపి విచారణ ప్రారంభించారు. గత రెండు రోజులుగా దర్శకుడు లోకేష్‌ను ప్రశ్నిస్తూ సమాచారం రాబడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X