గుట్టుచప్పుడుగా సంజన గల్రానీ మతం మార్చు.. శాండల్‌ఉడ్‌లో లవ్ జిహద్!
డ్రగ్ రాకెట్ కేసులో అరెస్టైన దక్షిణాది హీరోయిన్ సంజన గల్రానీకి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొద్ది రోజుల క్రితం ఆమె పెళ్లికి సంబంధించిన విషయం మీడియాలో చర్చనీయాంశమైంది. ఆ చర్చ ఇంకా సద్దుమణగకుండానే సంజన మతం గురించి తాజా విషయం వెలుగులోకి రావడం మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అయితే తాను మతం మార్చుకొన్న విషయాన్ని దాచడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మతం మార్పు వివాదానికి సంబంధించి వివరాల్లోకి వెళితే...

డ్రగ్ రాకెట్ కేసులో అరెస్టై..
డ్రగ్స్ రాకెట్‌లో సంజన గల్రానీ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పనా అగ్రహార జైలులో కస్టడీలో ఉన్నారు. ఆమె ప్రస్తుతం బెయిల్‌పై బయటకు రావడానికి కష్టాలు పుడుతున్నది. ఇలాంటి నేపథ్యంలో కన్నడ మీడియా ఆమె మతం మార్చుకొన్న విషయాన్ని బట్టబయలు చేసింది. సంజన ముస్లిం మతాన్ని స్వీకరించినట్టు ఆధారాలను బయటపెట్టింది.

డాక్టర్ అజీజ్‌తో పెళ్లి అంటూ వార్తలు వైరల్
బెంగళూరుకు చెందిన కార్డియోవాస్కులర్ సర్జన్ డాక్టర్ అజీజ్ పాషాతో పెళ్లి జరిగినట్టు ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సెప్టెంబర్ 7న తన వివాహంపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ నా పెళ్లి జరిగినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. నాకు పెళ్లి జరగలేదనే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాను. ఇకపై నా పెళ్లిపై ఎలాంటి వార్తలు వచ్చిన రూమర్లు, గాసిప్స్‌గానే భావించండి సంజనా క్లారిటీ ఇచ్చారు.

పెళ్లి కాలేదు.. మూడేళ్ల క్రితం నిశ్చితార్థం
సంజన తనకు పెళ్లి కాలేదని చెబుతుంటే తల్లి రేష్మా గల్రానీ చెప్పిన విషయం అందుకు భిన్నంగా ఉంది. రేష్మా గల్రానీ స్పందిస్తూ.. సంజనాకు వివాహం జరుగలేదు కానీ డాక్టర్ అజీజ్ పాషాతో మూడేళ్ల క్రితం నిశ్చితార్థం జరిగింది. వాస్తవానికి ఏప్రిల్‌లో వారిద్దరు పెళ్లి చేసుకోవాలి. కరోనావైరస్ కారణంగా పెళ్లి వాయిదా పడింది అని అన్నారు. అయితే బయటకు వచ్చిన పెళ్లి ఫోటో బంధువుల పెళ్లిలో తీసుకొన్నదని సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ ఫోటో మతం మార్చుకొన్న సమయంలో అనే విషయం ధృవీకరిస్తున్నారు.

మతం మార్పు అలా..
సంజనా గల్రానీ మతం మార్చుకొన్నట్టు ఇచ్చిన సర్టిఫికెట్‌ను మీడియాకు రిలీజ్ చేశారు. కన్నడ సమాచార హక్కు (ఆర్టీఐ) కార్యకర్త ప్రశాంత్ సంబర్గి ఈ విషయాన్ని బయటపెట్టారు. సంజనా గల్రానీ అలియాస్ అర్చన మనోహర్ గల్రానీ మతం మార్చుకొన్నది. మతం మార్చుకొన్న తర్వాత ఆమె మహిరాగా ఆమె పేరు మార్చుకొన్నారనే విషయాన్ని ధృవీకరణ పత్రంలో పేర్కొన్నారు. ఈ మత మార్పిడికి సంబంధించిన పత్రాలను బెంగళూరులోని దారుల్ ఉలూం షా వాలియుల్లా నుంచి పొందినట్టు తెలిసింది.
Recommended Video

2018లోనే ఇస్లాం మతంలోకి సంజనా గల్రానీ
సంజనా మత మార్పిడి 2018లో అక్టోబర్ 9వ తేదీన జరిగినట్టు ధృవీకరణ పత్రంలో పేర్కొన్నారు. ఇస్లాం మతం నిబంధనలకు ఆకర్షితులయ్యాను. గత 10 ఏళ్లుగా ఇస్లాం మతానికి సంబంధించిన ప్రవచనాలు, గ్రంధాలు చదువుతున్నాను. అవి నచ్చడం వల్లే ఇస్లాం మతాన్ని స్వీకరించాను అని సంజనా తన సన్నిహితులతో చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలో కన్నడ పరిశ్రమలో లవ్ జిహద్ జరిగిందనే వాదనను హిందుత్వ వాదులు పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











