హీరోయిన్లే బలి పశువులు కావాలా? పవన్ కల్యాణ్, ప్రభాస్ అంటూ డ్రగ్స్‌పై సంజన గల్రానీ

డ్రగ్ రాకెట్ వ్యవహారంలో ఆరోపణలు వస్తుండటంపై హీరోయిన్ సంజనా గల్రానీ ఆవేదన వ్యక్తం చేశారు. కన్నడ సినీ పరిశ్రమకు డ్రగ్స్ మాఫియా సంబంధాలు బయటపడటంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి దాడులు కొనసాగిస్తున్నారు. తమ దాడుల్లో భాగంగా సంజనా అసిస్టెంట్ రాహుల్‌ను అరెస్ట్ చేయడంతో ఆమెపై కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆమె స్పందిస్తూ...

 మీడియా నుంచి విపరీతంగా కాల్స్

మీడియా నుంచి విపరీతంగా కాల్స్

నాకు మీడియా అంటే గౌరవం. మీడియాలో నాకు స్నేహితులు ఉన్నారు. వారితో నేను దురుసుగా ప్రవర్తించలేను. నా అసిస్టెంట్ అరెస్ట్ తర్వాత నాకు మీడియా నుంచి చాలా కాల్స్ వచ్చాయి. కనీసం కట్ చేసేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా ఏకధాటిగా ఫోన్లు చేసి విసుగు తెప్పించేలా ప్రయత్నించారు అని సంజన గల్రానీ అన్నారు.

నాకు సంబంధం లేని వ్యక్తుల గురించి అడిగితే

నాకు సంబంధం లేని వ్యక్తుల గురించి అడిగితే

ఇక నాకు సంబంధం లేని వ్యక్తుల గురించి అడిగితే నేను ఏం చెప్పగలను. రాజకీయ నాయకులకు బ్రోకర్‌గా వ్యవహరించే ప్రశఆంత్ సంబర్గీ గురించి అడిగితే నాకు ఏం తెలుస్తుంది. అసలు ఎవరి గురించి అడుగుతున్నారో నాకు తెలియని పరిస్థితి. నాకు ఆయనకు సంబంధాలు అంటగడుతూ మీడియా కథనాలు రావడం దారుణం అని సంజన గల్రానీ అన్నారు.

పవన్ కల్యాణ్, ప్రభాస్ లాంటి హీరోలతో

పవన్ కల్యాణ్, ప్రభాస్ లాంటి హీరోలతో

నా కెరీర్‌లో సుమారు 50 ప్రాజెక్టులు చేశాను. శివన్న, దర్షన్, పవన్ కల్యాణ్, ప్రభాస్, మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి ప్రముఖ హీరోలతో నటించాను. సుదీప్ కిచ్చతో కలిసి బిగ్‌బాస్ షోలో పనిచేశాను. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న నాకు డ్రగ్స్ రాకెట్‌తో రిలేషన్స్ అంటగట్టడం బాధ కలిగించింది. రేటింగ్ కోసం టెలివిజన్ ఛానెళ్లు నాపై ఆరోపణలు చేయడం ఆవేదనకు గురి చేసింది అని సంజనా గల్రానీ అన్నారు.

హీరోయిన్లే బలి పశువులుగా మారాలా?

హీరోయిన్లే బలి పశువులుగా మారాలా?

సినీ పరిశ్రమలో ఏదైనా వివాదం చోటుచేసుకొంటే ప్రతీసారి హీరోయిన్లనే ఎందుకు టార్గెట్ చేస్తారో అర్ధం కాదు. వారినే బలి పశువులుగా మార్చేందుకు కుట్రల జరుగుతాయి. హీరోల పేర్లు ఎందుకు బయటకు రావో అర్థం కావు. మహిళలు బలహీనులనే ఇలా చేస్తారా అంటూ సంజన గల్రానీ ఆవేదన వ్యక్తం చేశారు.

Recommended Video

ఆ వీడియో షేర్ చేసి దొరికిపోయిన సినీనటి సంజన.. పోలీసుల నోటీసులు!!
 నాకు డ్రగ్స్‌తో సంబంధాలు లేవు

నాకు డ్రగ్స్‌తో సంబంధాలు లేవు

ఇక డ్రగ్స్ వినియోగం విషయానికి వస్తే.. బర్త్ డే పార్టీలు, ఇతర పార్టీలలో ఆల్కాహాల్ తీసుకోవడం నేను చూశాను. నేను అలాంటి వేడుకల్లో పాల్గొన్నాను. కానీ డ్రగ్స్ విషయానికి వస్తే నేను చాలా దూరంగా ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నాకు తెలియని విషయంపై నన్ను అడిగితే చాలా ఇరిటేషన్ కలుగుతున్నది అంటూ సంజన ఘాటుగా స్పందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X