twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంజనతో శ్రీలంకకు కాంగ్రెస్ ఎమ్మెల్యే.. బయటపెట్టిన డీలర్.. డ్రగ్ రాకెట్‌లో మరో సంచలనం!

    |

    బెంగళూరు డ్రగ్స్ రాకెట్ కేసులో సినీ తారలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ అరెస్ట్ కావడం సినీ వర్గాల్లో సంచలనం రేపింది. ఈ కేసులో వారు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించడంతో కస్టడీకి తరలించారు. సంజన, రాగిణితోపాటు రాహుల్ తొన్సే, పెప్పర్ సాంబా, నియాజ్ మహ్మాద్, ప్రశాంత్ రంకాను సెప్టెంబర్14వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి తరలించారు. అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రశాంత్ సంబర్గీ నటి సంజన గురించి వెల్లడించిన విషయలు సంచలనంగా మారాయి. ఆ విషయాలు ఏమింటటే..

    పోలీసు కస్టడీకి రాగిణితోపాటు 12 మంది

    పోలీసు కస్టడీకి రాగిణితోపాటు 12 మంది

    డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో రాగిణితోపాటు 12 మందిపై బెంగళూరులోని కటాన్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఎఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో 12 మందికి ఎనిమిది రోజుల కస్టడీకి తీసుకొన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నందున పోలీస్ కస్టడీ అవసరమని అధికారుల వాదనకు కోర్టు సానుకూలంగా స్పందించింది.

    రాగిణి, సంజన అరెస్టుల తర్వాత

    రాగిణి, సంజన అరెస్టుల తర్వాత

    రాగిణి ద్వివేది, సంజన గల్రానీ అరెస్ట్ తర్వాత బెంగళూరులో అరెస్టుల జోరు కొనసాగుతున్నది. హర్యానాకు చెందిన బెంగళూరు వాసి ఆదిత్య అగర్వాల్ అనే వ్యాపారవేత్తను అరెస్ట్ చేశారు. అలాగే ప్రతీక్ షెట్టి అనే డ్రగ్స్ సరఫరాదారుడు అరెస్ట్ చేశారు. రాగిణి, సంజనకు సన్నిహితులైన రాహుల్, రవి శంకర్లకు సన్నిహితుడని జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ వెల్లడించారు.

    కీలక సూత్రధారి అరెస్ట్‌తో

    కీలక సూత్రధారి అరెస్ట్‌తో

    గతంలో కూడా ప్రతీక్ షెట్టిని బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్యూరో అధికారులు బనస్వాదిలో అరెస్ట్ చేశారు. ప్రతీక్‌తోపాటు ఇద్దరు ఆఫ్రికా దేశస్థులను కూడా అరెస్ట్ చేయడం అప్పట్లో సంచలనం రేపింది. వారి వద్ద నుంచి 1.5 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొన్నారు.

    ప్రముఖ వ్యాపారవేత్తపై ప్రశాంత్ సంబర్గీ‌పై ఎఫ్ఐఆర్

    ప్రముఖ వ్యాపారవేత్తపై ప్రశాంత్ సంబర్గీ‌పై ఎఫ్ఐఆర్

    డ్రగ్స్ కేసులో సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త ప్రశాంత్ సంబర్గిని విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. విచారణలో బాలీవుడ్‌ నటులు, పలువురు సినీ సెలబ్రిటీల పేర్లను వెల్లడించినట్టు సమాచారం. అయితే గతంలో శ్రీలంక క్యాసినోలో నిర్వహించిన డ్రగ్స్ పార్టీలకు సినీ తారలు భారీగా హాజరయ్యారు. సంజన గల్రానీ వెంట ఎమ్మెల్యే జమీర్ ఆహ్మద్ ఖాన్ కూడా వచ్చారని ప్రశాంత్ చెప్పినట్టు బెంగళూరు మిర్రర్ కథనాన్ని ప్రచురించింది.

    Recommended Video

    ఆ వీడియో షేర్ చేసి దొరికిపోయిన సినీనటి సంజన.. పోలీసుల నోటీసులు!!
    సంజన ఎవరో తెలియదని ఎమ్మెల్యే ఖండన

    సంజన ఎవరో తెలియదని ఎమ్మెల్యే ఖండన

    అయితే సంజన గల్రానీతో తాను శ్రీలంకకు వెళ్లినట్టు వస్తున్న వార్తలను చమ్రాజ్‌పేట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ ఆహ్మద్ ఖాన్ ఖండించారు. సంజన గల్రానీ ఎవరో తెలియదు. కనీసం ఆమె ముక్కు ముఖం కూడా ఎలా ఉంటుందో తెలియదు. ఆమె నటించిన సినిమాలు కూడా ఇంత వరకు చూడలేదు అంటూ ఎమ్మెల్యే ఖండించారు. తనపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని ఎమ్మెల్యే చమ్రాజ్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    English summary
    Drug Rocket investigation going with High note in Bangalore. Arrested Business man Prashanth Sambargi revealed that Congress MLA BZ Zameer Ahmed Khan alleged links with Sanjjanaa Galrani and he toured Sri Lanka tour with sandalwood actor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X