మానవత్వం చూపిన హీరోయిన్ సంజన గల్రానీ.. సినీ కార్మికులకు రేషన్ కిట్లు

కరోనావైరస్ పరిస్థితుల కారణంగా అతలాకుతలమైన రోజువారీ సినీ కార్మికులను ఆదుకొనేందుకు స్టార్ హీరోలు, హీరోయిన్లు ముందుకొస్తున్నారు. ఆదాయం లేక, నిత్యావసర వస్తువులును కొనుగోలు చేయలేని సినీ కార్మికుల కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు హీరోయిన్ సంజనా గల్రానీ ముందుకొచ్చారు. ఈ సందర్బంగా ఒక వీడియోను రిలీజ్ చేసి తాను పంపిణి చేయబోయే నిత్యావసర వస్తువుల పంపిణి గురించి వెల్లడించారు.

వీడియోలో సంజనా గల్రానీ మాట్లాడుతూ.. ఈ రోజు మీ ముందు నేను ఇలా ఉన్నానంటే.. నా ఉన్నతి కారణమైన సినీ పరిశ్రమలోని ప్రతీ ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. సంజనా గల్రానీ ఫౌండేషన్ తరఫున కన్నడ సినీ కార్మికులకు జూన్ 3వ తేదీ ఉదయం 8.30 గంటలకు రేషన్ కిట్స్ పంచుతున్నాను తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.

Sanjjanaa Galrani to distribute the Ration kits amid Coronavirus crisis

కన్నడ పరిశ్రమలోని లైటింగ్, ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్స్‌లో పని చేసే వారికి రేషన్ కిట్స్ పంచుతున్నాం. ఈ కార్యక్రమానికి ఎన్ కుమార్ సార్, ఇతర ప్రముఖులు హాజరవుతున్నారు. సీనియర్ నిర్మాతలు తీసుకొన్న నిర్ణయానికి అనుగుణంగా రేషన్ కిట్లు పంచడానికి ముందుకొచ్చాం. మా చిరు సహకారాన్ని అందుకోవాల్సిందిగా సంజనా గల్రానీ ఫౌండేషణ్ తరఫున కోరుతున్నాం అని తెలిపారు.

సొగ్గాడు సినిమాతో టాలీవుడ్‌లోకి ప్రవేశించిన సంజనా గల్రానీ.. ఆ తర్వాత ప్రభాస్‌తో కలిసి బుజ్జిగాడు చిత్రంలో నటించారు. సుముద్రుడు, పోలీస్ పోలీస్, దుశ్శాసన, ముగ్గురు, అవును2, జగన్ నిర్దోషి, 2 కంట్రీస్, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X