ఆ హీరో భార్యపై కాంతార హీరోయిన్ 10 కోట్ల పరువునష్టం దావా.. సప్తమీ గౌడ చెప్పిన వాస్తవం ఏమిటంటే?
తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై పాపులర్ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం తమ్ముడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో వకీల్ సాబ్ లాంటి హిట్ సాధించిన దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కన్నడ హీరోయిన్లు సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ, మలయాళ హీరోయిన్ స్వస్తిక, తెలుగు నటీనటులు లయ, హరితేజ, బాలీవుడ్ నటుడు సౌరబ్ సచ్‌దేవ, టెంపర్ వంశీ చమ్మక్ చంద్ర తదితరులు నటించారు. ఈ సినిమా జూలై 4వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రమోషన్స్ కార్యక్రమంలో ఫిల్మీబీట్ ఎడిటర్ రాజబాబు అనుములతో హీరోయిన్ సప్తమీ గౌడ మాట్లాడుతూ.. తనపై వచ్చిన ఆరోపణలు, పరువునష్టం దావా కేసు గురించి వివరణ ఇచ్చారు. సప్తమీ గౌడ వివాదం గురించి మాట్లాడుతూ..
కాంతార చిత్రంలో తనదైన నటనతో ఆకట్టుకొన్న సప్తమీ గౌడ కన్నడ ఇండస్ట్రీలో ఓ భారీ వివాదంలో చిక్కుకొన్నారు. యువ కన్నడ చిత్రంలో హీరో యువ రాజ్‌కుమార్‌తో ఆయన భార్య శ్రీదేవీ బైరప్ప విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే తన పిటిషన్‌లో యువ, సప్తమీ గౌడ మధ్య వివాహేతర సంబంధం ఉంది అని ఆరోపణలు చేయడం వివాదంగా మారింది. అయితే తనపై అవాస్తవ ఆరోపణలు చేసినందుకు పరువు నష్టం చెల్లించాలి. అలాగే పబ్లిక్‌గా క్షమాపణ చెప్పాలి అని సప్తమీ గౌడ కోర్టును ఆశ్రయించారు.

యువ రాజ్‌కుమార్ మాజీ భార్య శ్రీదేవీ బైరప్ప చేసిన ఆరోపణలను సప్తమీ గౌడ ఖండంచింది. తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు గాను.. 10 కోట్ల రూపాయలు పరువు నష్టం కింద చెల్లించాలి. అలాగే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ వివాదంపై బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో కేసు కొనసాగతున్నది. అయితే తన గురించి, యువతో ఉన్న రిలేషన్‌షిప్ గురించి ఇంటర్నెట్, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండిచారు.
యువ రాజ్‌కుమార్‌తో వివాదం ఇంటర్నెట్‌లో కథనాలు రావడం నా దృష్టికి వచ్చింది. ఇంటర్నెట్, సోషల్ మీడియాలో వచ్చే స్టోరీలను ఏం చేయలేం. నేను దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. కాబట్టి నేను ఇప్పుడు ఆ కాంట్రవర్సి గురించి నేను ఏమీ మాట్లాడలేను. కాబట్టి కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత దాని గురించి పూర్తిగా వివరాలు వెల్లడిస్తాను అని సప్తమీ గౌడ చెప్పారు.

అయితే యువ రాజ్‌కుమార్‌తో శ్రీదేవీ బైరప్ప విడాకల కేసు కూడా కోర్టులో కోనసాగుతున్నది. ఈ వ్యవహారంలో సప్తమీ పేరు కూడా ముడిపడి ఉండటంతో తమ్ముడు ప్రమోషన్స్ కార్యక్రమంలో ఆమె ఆచీతూచీ మాట్లాడారు. కోర్టు పరిధిలో ఉన్నందున ఆ వివాదంపై నేను వ్యాఖ్యానించడం సరికాదు అని సప్తమీ గౌడ చెప్పారు.
ఇదిలా ఉండగా, బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. కాంతార సినిమా తర్వాత బాలీవుడ్ మూవీలో కూడా నటించాను. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ది వ్యాక్సిన్ వార్ సినిమాలో నటించాను. అయితే బాలీవుడ్ చాలా గ్లామరస్ వరల్డ్. కానీ ఆ సినిమాలో నేను అందుకు భిన్నంగా డీ గ్లామరైజ్డ్ క్యారెక్టర్‌లో నటించాను. ఏదైనా మంచి పాత్ర వస్తే.. బాలీవుడ్‌లో నటించేందుకు ఆసక్తి చూపుతాను. కేవలం హిందీలోనే కాకుండా ఏ భాషలోనైనా మంచి పాత్ర వస్తే నటించడానికి నేను సిద్దమే అని సప్తమీ గౌడ అన్నారు.


Click it and Unblock the Notifications











