»   » రాంగోపాల్ వర్మ నన్ను మోసం చేశాడు.. కిల్లర్ వీరప్పన్ సమయంలో..

రాంగోపాల్ వర్మ నన్ను మోసం చేశాడు.. కిల్లర్ వీరప్పన్ సమయంలో..

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  'Ram Gopal Varma Cheated Me' Says Shanmukha Priya

  దక్షిణాది రాష్ట్రాలను గడగడలాండించిన కిల్లర్ వీరప్పన్ సంచలన ఎన్‌కౌంటర్‌కు సంచలనంగా నిలిచిన షణ్ముఖ ప్రియ అప్పట్లో సెన్సేషనల్‌గా మారింది. వీరప్పన్ కదలికలపై సమాచారం ఇచ్చి ఆయన మరణానికి కారణమైంది. అప్పట్లో తనకు ప్రకటించిన పారితోషికాన్ని ప్రభుత్వం ఇవ్వలేదు. అంతేకాకుండా కిల్లర్ వీరప్పన్ సినిమా షూట్ సమయంలో తన నుంచి కీలక సమాచారం తీసుకొన్న దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా తనను మోసం చేశారని వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి స్నేహితురాలు షణ్ముఖప్రియ పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే..

  వీరప్పన్ ఎన్‌కౌంటర్ సమయంలో

  వీరప్పన్ ఎన్‌కౌంటర్ సమయంలో

  వీరప్పన్ ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు నా వయసు 21 ఏళ్లు. నా కాలేజ్ విద్యను పూర్తి చేసుకొంటున్నాను. అప్పుడే కర్ణాటక ప్రభుత్వానికి నేను సమాచారం ఇచ్చాను. ప్రధాని, పీఎంవో కార్యాలయం నా లెటర్లకు స్పందించింది. అప్పట్లో 5 కోట్లు, ఇంటి స్థలం ఇస్తానని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు అని షణ్ముఖప్రియ వెల్లడించింది.

  కిల్లర్ వీరప్పన్ మూవీ షూట్‌కు ముందు

  కిల్లర్ వీరప్పన్ మూవీ షూట్‌కు ముందు

  కర్ణాటక ప్రభుత్వమే కాకుండా దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా తనను మోసగించాడు. కిల్లర్ వీరప్పన్ సినిమా తీసే ముందు నన్ను సంప్రదించాడు. నా నుంచి కథకు సంబంధించిన కీలక సమాచారాన్ని తీసుకొన్నారు. స్టోరికి సంబంధించిన సమాచారాన్ని అందించినందుకు గాను భారీ పారితోషికాన్ని ఇస్తానన్నాడు. నాకు రూ.1 లక్ష అడ్వాన్సుగా ఇచ్చారు. మిగితా మొత్తం ఇచ్చేందుకు నాకు అగ్రిమెంట్ చేసుకొన్నాడు.

  వర్మపై కేసువేశాను

  వర్మపై కేసువేశాను

  కిల్లర్ వీరప్పన్‌కు సంబంధించి నాకు రావాల్సిన మొత్తాన్ని ఇవ్వకుండా ముఖం చాటేశాడు. తాను పలుమార్లు అడిగినప్పటికీ.. రేపు, ఎల్లుండి అంటూ నాన్చబెట్టారు.
  తనతో చేసుకొన్న అగ్రిమెంట్‌ను తుంగలో తొక్కాడు. తనకు జరిగిన అన్యాయానికి కోర్టులో కేసు వేశాను. ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది అని ఇటీవల మీడియాకు వెల్లడించారు.

  ప్రాణాలకు ముప్పు ఉండేది

  ప్రాణాలకు ముప్పు ఉండేది

  ప్రస్తుతం తాను కష్టాల్లో ఉన్నానని షణ్ముఖ ప్రియ వెల్లడించారు. తనకు ఇచ్చిన హమీ మేరకు ప్రభుత్వమైనా లేదా రాంగోపాల్ వర్మ తనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇచ్చేయాలని సూచించారు. ప్రాణాలను పణంగా పెట్టి వీరప్పన్ సమాచారం అందించాను. ఆ ఆపరేషన్‌లో ఏదైనా అటు, ఇటూ అయితే తన ప్రాణాలకు ముప్పు ఉండేదని షణ్ముఖ ప్రియ అన్నారు.

  English summary
  Shanmukha priya alleges Ram Gopal Varma on her remunaration in Killer Veerappan. Varma has given only Rs.1 lakh only. In this matter she filed a case in court. Veerappan life Ended by police officers with the help of information from a lady called Shanmukha priya, She informed the police that Veerappan is coming for eye treatment so that they can catch him. But she didn't get any reward money as promised by the government.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more