‘బజరంగీ-2’ టీజర్ వైరల్.. ట్రెండింగ్‌లో శివరాజ్ కుమార్

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సినిమాలంటే శాండల్‌వుడ్‌లో ఓ పండగే. నేడు ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన నటించిన కొత్త చిత్రం 'బజరంగీ-2' టీజర్ రిలీజ్ అయింది. ఈ మూవీ 2013 లో వచ్చి పెద్ద హిట్ అయిన " బజరంగీ " చిత్రానికి సీక్వెల్. అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. టీజర్ ఇంతగా వైరల్ కావడంతో హీరో తన ఆనందాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.

హీరో శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. '2013లో మేము తీసిన బజరంగీ పెద్ద హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా ఈ బజరంగీ-2 మూవీ భారీగా తీయాలని భావించాం. కానీ ఈ టీజర్‌కు ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. అన్ని ఇండస్ట్రీల నుంచి కాల్స్ వస్తున్నాయి. ఈ అద్భుతమైన రెస్పాన్స్‌కి అందరికీ ధన్యవాదాల'ని అన్నారు. ఈ రోజు సోషల్ మీడియాలో శివ రాజ్ కుమార్ పేరు ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది.

Shiva Rajkumar Bhajarangi 2 teaser Goes Viral

కేజీయఫ్ చిత్రం తరువాత శాండల్ వుడ్ చిత్రాలకు మంచి గిరాకీ ఏర్పడింది. కేజీయఫ్‌తో ప్యాన్ ఇండియా లెవెల్‌లో కన్నడ ఇండస్ట్రీకి క్రేజ్ వచ్చింది. బజరంగీ-2 టీజర్‌లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. బాక్ గ్రౌండ్ స్కోర్, గ్రాఫిక్స్ షాట్స్ చూస్తుంటే మరో కెజిఎఫ్ తరహా సినిమా కాబోతుందనిపిస్తోంది. ఈ మూవీలో శివరాజ్ కుమార్ సరసన భావన హీరోయిన్‌గా నటిస్తుంది. జయన్న ఫిలిమ్స్ బ్యానర్ పై జయన్న మరియు భోగేంద్ర కలిసి నిర్మిస్తున్న ఈ మూవీని ఎ.హర్ష తెరకెక్కించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X