RC16: రామ్ చరణ్ సినిమాలో సూపర్ స్టార్.. ఏంటి ఇది మల్టీస్టారర్ మూవీనా!
టాలీవుడ్‌లో తక్కువ సినిమాలే చేసినా.. విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలు కొందరే ఉన్నారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. గతంలో కమర్షియల్ సినిమాలు చేసినా.. ఈ మధ్య ప్రయోగాలు చేస్తోన్న అతడు.. వరుసగా హిట్లు కొట్టడంతో పాటు గ్లోబల్ స్టార్ అన్న పేరుకు కూడా సొంతం చేసుకున్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్నారు. ఈ సినిమా పూర్తి కాకుండానే రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సనతో చేస్తున్నట్లు ప్రకటించేశాడు.

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన తెరకెక్కించబోయే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుందని ఇప్పటికే మేటర్ బయటకు వచ్చేసింది. అంతేకాదు, ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. చరణ్.. శంకర్ సినిమాను పూర్తి చేసిన వెంటనే ఇది మొదలవబోతుంది.
పాన్ ఇండియా రేంజ్‌లో, హై లెవెల్ స్కేల్‌తో రాబోయే ఈ సినిమాలో ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్లు భాగం కాబోతున్నారు. ఇందులో భాగంగానే ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన లయను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారని, విలన్‌గా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని ఎంపిక చేశారని ఇప్పటికే న్యూస్ వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే.
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం కన్నడ సూపర్ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్‌ను తీసుకున్నారని తెలిసింది. తాజాగా ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, ఆ పాత్ర ఎలా ఉంటుంది అన్నది మాత్రం చెప్పలేదు. దీంతో రామ్ చరణ్ చేస్తున్న ఈ చిత్రం మల్టీస్టారర్ మూవీగా రాబోతుందా అని అందరూ అనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ - బుచ్చిబాబు కలయికలో రాబోయే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందనుంది. దీన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే, ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











