Shiva Rajkumar's Ghost వింటేజ్‌ లుక్‌తో అదరగొట్టిన శివరాజ్‌కుమార్..

కరుణడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ తన తాజా సినిమా ఘెస్ట్ లుక్‌తో అంచనాలు పెంచేశాడు. న్యూ ఇయర్ సందర్భంగా ఓ క్రేజీ లుక్‌ను రిలీజ్ చేసి అభిమానులకు పండుగ వాతావరణాన్ని కల్పించాడు. కన్నడ బీర్బల్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన దర్శకుడు శ్రీని ప్రస్తుతం శివరాజ్ కుమార్‌తో జతకట్టాడు. సందేశ్ బ్యానర్‌పై కన్నడ రాజకీయ నేత, నిర్మాత సందేశ్ నాగరాజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నూతన సంవత్సరం సందర్భంగా రెట్రో మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసి ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

శివరాజ్ కుమార్ నటించిన ఘోస్ట్ మోషన్ పోస్టర్ సరికొత్తగా డిజైన్ చేశారు. హీరోయిజాన్ని ఉట్టిపడేలా సినిమా కథలోని కీలక అంశాలు కలగలిపి థీమ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కార్ స్పీడో మీటర్, ఎగిరే బుల్లెట్లు, గన్ ఫైర్ అవగానే కారు దూసుకు రావడం, ఎగిరే బుల్లెట్లు, మెషీన్ గన్... వీటికి తోడు అర్జున్ జన్య అందించిన పవర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరగొట్టింది. శివన్న వింటేజ్ లుక్ మోషన్ పోస్ట‌ర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్ళాయి. ఈ లుక్ ఘోస్ట్ చిత్రంలో కీలకమైన ఫ్లాష్ బ్యాక్‌తో వస్తుందని చిత్ర యూనిట్ వెల్లడించారు.

Shiva Rajkumars Ghost motion poster review

యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఘోస్ట్ మూవీ రెండో షెడ్యూల్ ఇటీవలే మైసూరులో పూర్తి చేసుకుంది. ఈ షెడ్యుల్ లో శివరాజ్ కుమార్, జయరామ్, ప్రశాంత్ నారాయణన్‌పై భారీగా నిర్మించిన జైలు సెట్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మూడో షెడ్యూల్ ఫిబ్రవరి మొదటి వారంలో బెంగళూరులో వేసిన మరో భారీ సెట్‌లో ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్‌లో హీరో ఇంట్రడక్షన్, క్లైమాక్స్ సన్నివేశాలు షూట్ చేస్తారు.

నటీనటులు: శివరాజ్ కుమార్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అచ్యుత్ కుమార్, దత్తన్న, అవినాష్ తదితరులు
దర్శకత్వం: శ్రీని (బీర్బల్)
సినిమాటోగ్రఫి: మహేంద్ర సింహ
సంగీతం: అర్జున్ జన్య
ఆర్ట్: శివ కుమార్ (కె జి ఎఫ్)
డైలాగ్స్: మస్తీ, ప్రసన్న వి ఎం
పీఆర్వో: బీఏ రాజు'స్ టీం

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X