HBD Shiva Rajkumar: యుద్ధ ట్యాంకర్‌తో భయపెట్టిన ఘోస్ట్.. క్లైమాక్స్ మాత్రం కేక అంతే!

కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ పెద్ద కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చిన్న వయసులోనే తన టాలెంట్లను నిరూపించుకుని.. సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోగా వెలుగొందారు సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్. ఆరు పదుల వయసులోనూ ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారాయన. అయితే, చాలా రోజులుగా భారీ సక్సెస్ కోసం వేచి చూస్తోన్న శివ రాజ్‌కుమార్.. ఇప్పుడు 'ఘోస్ట్' అనే ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీని చేస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అందరిలోనూ అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ హీరోగా ఎంజీ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న చిత్రమే 'ఘోస్ట్'. పూర్తి స్థాయి యాక్షన్ స్టోరీతో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే చాలా భాగం టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు చిత్ర హీరో శివ రాజ్‌కుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు.

Shiva Rajkumar Starrer Ghost Movie First Glimpse Released

'ఘోస్ట్' మూవీ ఫస్ట్ గ్లింప్స్ వీడియోలో శివ రాజ్‌కుమార్‌ను నెక్ట్స్ లెవెల్ ఎలివేషన్‌తో చూపించారని చెప్పొచ్చు. ఆయన ఓ గోడౌన్‌లో కూర్చుని మందు తాగుతూ ఉండగా.. విలన్ గ్యాంగ్ గన్స్ పట్టుకుని వస్తుంది. అప్పుడాయన తన వెనకాల ఉన్న ఓ క్లాత్‌పై ఆల్కహాల్ పోసి మంట అంటిస్తారు. దీంతో దాని వెనుక ఉన్న యుద్ధ ట్యాంకర్ కనిపిస్తుంది. అది చూసిన వాళ్లంతా భయపడుతుండగా.. హీరో ఆ మంటల్లో నుంచి ఓ పుల్లను తీసుకుని సిగరెట్ వెలిగిస్తూ గర్వంగా చూస్తారు. ఈ సీన్స్ హైలైట్‌గా ఉన్నాయి.

'ఘోస్ట్' మూవీ ఫస్ట్ గ్లింప్స్‌లో బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ వీడియో చివర్లో శివ రాజ్‌కుమార్ 'మీరు గన్నుతో ఎంత మందిని భయపెట్టినా.. అంతకంటే ఎక్కువ మందిని నేను నా కళ్లుతో భయపెట్టాను. వాళ్లంతా నన్ను ఓజీ అని పిలుస్తారు. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' అంటూ చెప్పే డైలాగ్ మాత్రం అదిరిపోయింది. మొత్తంగా ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచే విధంగానే ఉంది.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'ఘోస్ట్' మూవీని సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నారు. దీనికి అర్జున్ జన్య సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో జయరాం, అనుపమ్ ఖేర్, ప్రశాంత్ నారాయణన్, అర్చన, సత్య ప్రకాశ్‌లు కీలక పాత్రలను చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X