విజయ్ దేవరకొండలో కమల్ హాసన్ కనిపిస్తున్నాడు!
విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' విడుదల నేపథ్యంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమాన్ ఈ యంగ్ హీరోకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ ఆయన బెంగుళూరులో మాట్లాడారు. విజయ్‌కు తాను పెద్ద అభిమానిని అని చెప్పిన శివ రాజ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'నేను కమల్ హాసన్‌కు వీరాభిమానిని. నాకు 12 సంవత్సరాల వయసు ఉన్నపుడు ఆయన నన్ను ఫస్ట్ టైమ్ హగ్ చేసుకున్నపుడు మూడు రోజుల వరకు స్నానం చేయలేదు. ఇపుడు విజయ్‌లో నేను కమల్ హాసన్‌ను చూస్తున్నాను' అని శివరాజ్ కుమార్ అన్నారు.

కమల్ హాసన్ మాదిరిగా విజయ్ దేవరకొండ కథల ఎంపిక విషయంలో చాలా స్మార్ట్‌గా ఉంటున్నారని ప్రశంసించారు. తాను విజయ్ నటించిన అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు సినిమాలు చూశాను. అయితే గీత గోవిందం సినిమా చూడాల్సి ఉంది అన్నారు.
విజయ్‌ను స్క్రీన్ మీద చూస్తుంటే ఒక ట్రీట్‌లా అనిపిస్తుంది. నోటా చిత్రాన్ని నేను మొదటి రోజు చూడటం మిస్సయితే తర్వాతి రోజు తప్పకుండా చూస్తాను. నా కూతురు కూడా విజయ్ దేవరకొండకు పెద్ ఫ్యాన్ అని శివరాజ్ కుమార్ అన్నారు. 'నోటా' నిర్మాత కెఇ జ్ఞానవేల్ రాజా తన తర్వాతి చిత్రానికి నిర్మాతగా వ్యవహరించబోతున్నారని, రూరల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీ ఉంటుందని తెలిపారు.
'నోటా'ను కర్నాటకలో రాక్‌లైన్ వెంకటేష్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆనందర్ శంకర్ దర్శకత్వం వహించగా మెహ్రీన్ హీరోయిన్. నాజర్, సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











