twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైమాలో అదరగొట్టిన రంగస్థలం, కేజీఎఫ్.. ఎవరెవరికీ ఎన్ని అంటే..

    |

    సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్‌ (సైమా) కార్యక్రమంలో తెలుగులో రంగస్థలం హవా కొనసాగిస్తే కన్నడలో యష్ నటించిన కేజీఎఫ్ దడదడలాడించింది. ఖతర్‌లోని దోహాలో జరిగిన ఈ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకలో కన్నడ, తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

    గతేడాది బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కేజీఎఫ్ చిత్రం సైమా అవార్డుల్లో ఎక్కువ పురస్కారాలను గెలుచుకొన్నది. అవార్డుల్లో యష్ సినిమా ప్రభంజనాన్ని కొనసాగించింది.

    SIIMA Awards 2019 Complete list: Yashs KGF tops in Kannada section

    సైమాలో కన్నడ ఉత్తమ అవార్డుల జాబితా
    ఉత్తమ నటుడు: యష్ (కేజీఎఫ్: చాప్టర్ 1)
    ఉత్తమ దర్శకుడు: ప్రశాంత్ నీల్ (కేజీఎఫ్: చాప్టర్ 1)
    ఉత్తమ హాస్య నటుడు: ప్రకాశ్ తుమినాడ్ (సర్కార్, రమణారాయ్)
    ఉత్తమ విలన్: ధనంజయ (తగరు)
    ఉత్తమ సహాయ నటి: అర్చన జాయిస్ (కేజీఎఫ్: చాప్టర్ 1)
    ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: మహేష్ కుమార్ (ఆయోగ)
    ఉత్తమ తొలి చిత్ర నటుడు: అనుపమ గౌడ (ఆ కరాళ రాత్రి)

    సైమా అవార్డ్స్‌ 2019 విజేతలు వీరే
    ఉత్తమ చిత్రం : మహానటి
    ఉత్తమ దర్శకుడు : సుకుమార్‌ (రంగస్థలం)
    ఉత్తమ నటుడు : రామ్‌చరణ్‌ (రంగస్థలం)
    ఉత్తమ నటి : కీర్తి సురేష్‌ (మహానటి)
    విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు : విజయ్‌ దేవరకొండ( గీత గోవిందం)
    విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి : సమంత (రంగస్థలం)
    ఉత్తమ సహాయ నటుడు : రాజేంద్ర ప్రసాద్‌ ( మహానటి)
    ఉత్తమ సహాయ నటి : అనసూయ (రంగస్థలం)
    ఉత్తమ హాస్య నటుడు : సత్య (ఛలో)
    ఉత్తమ విలన్‌ : శరత్‌ కుమార్‌ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)
    ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీ శ్రీ ప్రసాద్‌ (రంగస్థలం)
    ఉత్తమ గేయ రచయిత : చంద్రబోస్‌ (ఎంత సక్కగున్నవవే - రంగస్థలం)
    ఉత్తమ గాయకుడు : అనురాగ్ కులకర్ణి( పిల్ల రా - ఆర్‌ఎక్స్‌ 100)
    ఉత్తమ గాయని : ఎంఎం మానసీ (రంగమ్మా మంగమ్మ - రంగస్థలం)
    ఉత్తమ తొలిచిత్ర నటుడు : కల్యాణ్ దేవ్‌ (విజేత)
    ఉత్తమ తొలిచిత్ర నటి : పాయల్‌ రాజ్‌పుత్‌ (ఆర్‌ఎక్స్‌ 100)
    ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు : అజయ్‌ భూపతి (ఆర్‌ఎక్స్‌ 100)
    ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ : రత్నవేలు (రంగస్థలం)
    ఉత్తమ కళా దర్శకడు : రామకృష్ణ (రం‍గస్థలం)
    సామాజిక మాధ్యమాల్లో పాపులర్‌ స్టార్ : విజయ్‌ దేవరకొండ

    English summary
    SIIMA Awards 2019 (సైమా అవార్డ్స్) starts with high note in Qatar. In this award function, Ram Charan's Rangasthalam and Yash's KGF: Chapter 1 won big at the awards from Telugu and Kannada cinema respectively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X