సింగర్ సుస్మిత సూసైడ్.. నా మరణానికి కారణం వారే.. ఉరేసుకొని..
వరకట్న వేధింపులతో వర్థమాన గాయని ఆత్మహత్య చేసుకోవడం కన్నడ సినిమా పరిశ్రమలో సంచలనం రేపింది. ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకొన్న సింగర్ సుస్మిత జీవితం అర్ధాంతరంగా ముగియడంపై సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ దారుణంగా సోమవారం బెంగళూరులోని నగరభావిలోని సుస్మిత తల్లిదండ్రులు ఇంట్లో చేటుచేసుకొన్నది. సుస్మిత ఆత్మహత్య ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా..

వరకట్నం వేధింపులు
గత కొద్ది రోజులు అత్తింటి వారి నుంచి వరకట్నం తీసుకురావాలని వేధింపులకు గురవుతున్నట్టు సుస్మిత తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నది. తీవ్ర మనో వేధనకు గురైన తాను సూసైడ్ చేసుకొంటున్నట్టు వాట్సప్‌లో సందేశం పంపారు. తన చావుకు కారణం భర్త, ఆయన కుటుంబ సభ్యులే కారణం అని వాట్సప్ మెసేజ్‌లో తెలిపింది. అనంతరం ఫ్యాన్ సీలింగ్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

సుస్మిత తల్లి ఫిర్యాదుతో
బెంగళూరు పోలీసులు వెల్లడించిన ప్రకారం.. సుస్మితకు శరత్ కుమార్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. సుస్మిత భర్త ఓ కార్ల షోరూంలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కొద్ది నెలలుగా అదనపు వరకట్నం తీసుకురావాలని వేధించారని, తన భర్తపై, ఆయన సోదరి, అత్తపై తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. దాంతో సుస్మిత తల్లి మీనాక్షి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది అని తెలిపారు.

మరణానికి ముందు వాట్సప్ మెసేజ్
మరణానికి ముందు రోజు అంటే ఆదివారం అర్థరాత్రి వరకు తనను వేధించారని సోదరుడు సచిన్‌కు రాత్రి 1.30 గంటలకు వాట్సప్ మెసేజ్ పంపింది. కానీ సచిన్ ఉదయం 5.30 గంటలకు మెసేజ్ చేసుకొని పరుగెత్తగా ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. అప్పటికే ఆమె మృతి చెందడంతో అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైయింట్ ఇచ్చారు.
Recommended Video


నా మరణానికి కారణం వారే
తన భర్త శరత్, ఆయన సోదరి గీత, ఆయన అత్త వైదేహి తనను వేధించారు. వారే తన ఆత్మహత్యకు కారణం ప్రాణంతో వారి ఇంటి గడప తొక్కనని నిర్ణయం తీసుకొన్నాను.. అందుకే తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చాను. అయినా వేధింపులు ఆగకపోవడంతో సూసైట్ చేసుకొంటున్నాను అని వాట్సప్ మెసేజ్‌లో తెలిపిందని పోలీసులు పేర్కొన్నారు. సింగర్ సుస్మిత మరణ వార్త వినగానే భర్తతోపాటు వారి కుటుంబం పరారీలో ఉన్నారు. వారిని పట్టుకొనేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే వారిని పట్టుకొంటామని అన్నారు.


Click it and Unblock the Notifications











