twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంజనా గల్రానికి షాక్.. జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు ఆదేశాలు

    |

    బెంగళూరు డ్రగ్ రాకెట్ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ సంజనా గల్రానీని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. కొద్ది రోజుల క్రితం అరెస్టైన సంజనాకు బుధవారంతో కస్డడీ ముగియడంతో కోర్టులో ప్రవేశపెట్టడగా ఒకటవ ఏసీఎంఎం కోర్టు జ్యూడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సంజనాతోపాటు వీరెన్ ఖన్నా,రవి శంకర్ తదితరులను జుడిషియల్ కస్టడీకి తరలించడం గమనార్హం. వీరందరినీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో ప్రవేశపెట్టారు.

    ఇక సెప్టెంబర్ 14వ తేదీన జ్యుడిషియల్ కస్టడీకి తరలించిన రాగిణి ద్వివేది బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, విచారణను సెప్టెంబర్ 19వ తేదీ వరకు వాయిదా వేశారు. తనకు వెన్నునొప్పి ఉన్నందున్న ప్రైవేట్ హాస్సిటల్‌లో చికిత్స అందించాలని బెయిల్ పిటిషన్ వేయగా, ఆమె అభ్యర్థను తిరస్కరించారు.

    South Actress Sanjjanaa Galrani remanded into judicial custody

    డ్రగ్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై సంజనా ఇంట్లో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించి ఆమెను అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం ఆమెను ప్రశ్నించి అరెస్ట్‌ను ధృవీకరించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించగా అందుకు ఆమె నిరాకరించారు. వైద్య పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించడం వివాదంగా మారిన విషయం తెలిసిందే.

    కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ మాఫియా లింక్ తీగను లాగి డొంకను కదిలించడం సంచలనం రేపింది. డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నట్టు పలువురు సినీ తారలపై ఆరోపణలు రావడం సినీ పరిశ్రమల్లో కలకలం రేపింది. ఈ క్రమంలో తొలుత ప్రముఖ హీరోయిన్ సంజనా గల్రానీ అసిస్టెంట్‌ రాహుల్‌ను, ఆ తర్వాత ఆమెను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అరెస్ట్ చేయడం తెలిసిందే.

    English summary
    Sanjjanaa Galrani responded on drug links: Why attack only on heroines. Sanjjanaa Galrani's assistant Rahul arrested news goes viral in Kannada film industry. It sent shock waves in the sandalwood. Latestly, South Actress Sanjjanaa Galrani remanded into judicial custody after her arrest few days ago
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X