డ్రగ్ రాకెట్‌లో మరో ఇద్దరు హీరో, హీరోయిన్ల పేర్లు.. వివేక్ ఒబేరాయ్ మరిది ఇంట్లో సోదాలు

కన్నడ డ్రగ్ రాకెట్ వ్యవహారంలో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దూకుడు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ తారలతోపాటు పలువురు డ్రగ్స్ సరఫరాదారులను అరెస్ట్ చేసి కస్టడీకి తరలించిన విషయం తెలిసిందే. ఈ సంచలన అరెస్టుల నేపథ్యంలో మరో ఇద్దరు సినీ తారలకు పోలీసులు సమన్లు జారీ చేయడం కన్నడ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఈ సమన జారీ గురించి పూర్తి వివరాలు..

కన్నడ సినీ తారలు దిగంత్, ఐంద్రిత

కన్నడ సినీ తారలు దిగంత్, ఐంద్రిత


కన్నడ సినిమా పరిశ్రమకు సంబంధించిన డ్రగ్ రాకెట్ కేసులో హీరో, హీరోయిన్లు దిగంత్ మంచాలే, ఐంద్రిత రే‌కు సమన్లు జారీ చేశారు. సెప్టెంబర్ 16వ తేదీన బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. దీంతో మరోసారి కన్నడ సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది.

పాపులర్ దిగంత్, ఐంద్రిత జంటకు

పాపులర్ దిగంత్, ఐంద్రిత జంటకు


దిగంత్ మంచాలే, ఐంద్రిత రే 2018లో ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. కన్నడ పరిశ్రమలో పాపులర్ సినీ జంటగా ఓ పేరుంది. దిగంత్ కన్నడ పరిశ్రమలో సీనియర్ నటుడిగా రాణిస్తున్నారు. ఐంద్రిత దాదాపు 30 చిత్రాల్లో నటించి గణనీయమైన అభిమానులను సొంతం చేసుకొన్నారు. ఇలాంటి పాపులర్ జంట పేర్లు డ్రగ్ రాకెట్‌లో తెరపైకి రావడం సంచలనంగా మారింది.

వివేక్ ఒబేరాయ్ మరిది ఇంట్లో సోదాలు

వివేక్ ఒబేరాయ్ మరిది ఇంట్లో సోదాలు


కన్నడ పరిశ్రమలో క్రైమ్ బ్రాంచ్ అధికారుల సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కన్న మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్య అల్వా నివాసంలో సోదాలు నిర్వహించారు. హెబ్బల్‌లోని ఆదిత్య నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆదిత్య అల్వా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్‌కి మరిది కావడం గమనార్హం. ఆదిత్య అల్వాని 12వ నిందితుడిగా చేర్చినట్టు జాయింట్ కమిషనర్ తెలిపారు.

Recommended Video

Bigg Boss Telugu 4: Episode 9 Highlights | 2nd Elimination Nominations
సెంట్రల్ జైలుకు రాగిణి తరలింపు

సెంట్రల్ జైలుకు రాగిణి తరలింపు

బెంగళూరు డ్రగ్ రాకెట్‌ కేసులో 14 రోజుల కస్టడీలో ఉన్న రాగిణి ద్వివేదిని సెంట్రల్ జైలుకు తరలించారు. సెప్టెంబర్ 4వ తేదీన అరెస్ట్ కాబడిన రాగిణికి మరో రెండు రోజుల కస్టడీ ఉంది. ఇక సంజన గల్రానీ, వీరేన్ ఖన్నా తదితరులు పోలీసు కస్టడీలోనే ఉన్నారు. ఇంకా పలువురి పేర్లు పోలీసుల దృష్టికి వచ్చినట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X