షూటింగ్‌లో కిచ్చా సుదీప్‌కు గాయాలు.. పూజలు నిర్వహిస్తున్న అభిమానులు!
కన్నడ స్టార్ హీరోలలో కిచ్చా సుదీప్ ఒకరు. విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ నటుడిగా దూసుకుపోతున్నాడు. సుదీప్ కన్నడలో మాత్రమే కాదు దక్షణాది భాషలన్నిటిలో మంచి అవకాశాలు అందుకుంటున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన ఈగ చిత్రంతో తెలుగులో కూడా సుదీప్ పాపులర్ అయ్యాడు. ఓ చిత్ర షూటింగ్ లో భాగంగా సుదీప్ గాయపడ్డట్లు తెలుస్తోంది.

కారు సన్నివేశంలో
సుదీప్ నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించి కారు సన్నివేశం షూట్ చేస్తున్నారు. ఈ సన్నివేశంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో సుదీప్ గాయపడ్డట్లు తెలుస్తోంది. ఆందోళన అవసరంలేదని, స్వల్పగాయాలు అని చిత్ర వర్గాలు అంటున్నాయి.

టీజర్ లాంచ్ కు కూడా
ఇటీవల సుదీప్ నటించిన ది విలన్ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్ కు సుదీప్ హాజరు కావాల్సి ఉన్నా గాయాల కారణంగా హాజరు కాలేకపోయాడు. సుదీప్ కు గాయపడ్డ సంగతి అభిమానులకు తెలియడంతో పెద్ద ఎత్తున పూజలు మొదలు పెట్టారు. సుదీప్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు.

వృత్తిలో భాగమే
తాను త్వరగా కోలుకోవాలని విష్ చేసిన అభిమానులందరికి సుదీప్ కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలువృత్తిలో భాగమే అని తెలిపాడు. సినిమా విషయంలో మంచి ఫలితాలు తీసుకురావాలంటే ఇలాంటి చిన్న కష్టాలు తప్పవని సుదీప్ తెలిపాడు.

కీలక పాత్రలో
సుదీప్ ఇప్పటికే తెలుగులో ఈగ, బాహుబలి వంటి చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ చిత్రం సైరా నరసింహారెడ్డిలో సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 200 కోట్ల భారీ బడ్జెట్ లో సైరా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











