twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో సుదీప్‌కు ఎదురుదెబ్బ.. అరెస్ట్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్

    |

    విలక్షణ నటుడు, కన్నడ హీరో సుదీప్ కిచ్చాకు చేదు అనుభవం ఎదురైంది. కర్ణాటకలో కాఫీ ఎస్టేట్ యజమాని ఫిర్యాదు చేసిన కేసుకు గైర్హాజరు కావడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పలుమార్లు నోటీసులు పంపినా హాజరు కాకపోవడంతో చిక్ మంగళూరు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన సుదీప్‌కు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వివరాల్లోకి వెళితే...

    హీరో సుదీప్‌పై కేసు ఇలా

    హీరో సుదీప్‌పై కేసు ఇలా

    కర్ణాటకలోని చిక్ మంగళూరులోని ఓ కాఫీ ప్లాంటేషన్‌లో షూటింగ్ సంఘటన సుదీప్‌కు సమస్యగా మారింది. గతలో కన్నడ టెలివిజన్ రియాలిటీ షో కోసం సుదీప్‌కు సంబంధించిన కిచ్చా క్రియేషన్స్‌ కాఫీ ఎస్టేట్‌లో షూటింగ్ జరిపింది. ఆ సందర్భంగా రూ.1.80 కోట్లు పారితోషికంగా చెల్లిస్తాననే ఒప్పందం జరిగింది. అయితే కేవలం రూ.50 వేలు మాత్రమే ఇచ్చారు. మిగితా మొత్తం ఎగవేతకు పాల్పడ్డారని కాఫీ ఎస్టేట్ యజమాని కేసు నమోదు చేశారు.

     ఆస్తి ధ్వంసం, మోసం అంటూ

    ఆస్తి ధ్వంసం, మోసం అంటూ

    తనకు జరిగిన అన్యాయంపై కిచ్చా క్రియేషన్స్‌పైనా, డైరెక్టర్ మహేష్‌పై ఎస్టేట్ యజమాని తొలుత జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ వివాదం సివిల్ పరిధిలోకి వస్తుండటంతో ఎస్పీ సలహా మేరకు బాధితుడు కోర్టును ఆశ్రయించారు. తనకు చెల్లించాల్సిన రుసుము చెల్లించకుండా మోసం చేశారు. తన కాఫీ తోటను, వారసత్వ ఆస్తిని ధ్వంసం చేశారు అని ఎస్టేట్ యజమాని దీపక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

     బెదిరింపులకు పాల్పడ్డారని

    బెదిరింపులకు పాల్పడ్డారని

    తనతో చేసుకొన్న ఒప్పందాన్ని ఉల్లంఘించి తన కాఫీ ఎస్టేట్స్‌లో షూటింగ్ కోసం ఎస్టేట్ నిర్మించారు. షూటింగ్ నిర్వహించినందుకు గాను చెల్లించాల్సిన మొత్తం ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో తనకు న్యాయం జరిగేలా చూడాలి అని యజమాని కోర్టును వేడుకొన్నారు. దీంతో చిక్ మగళూరులోని జెఎంఎఫ్‌సీ న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

     సుదీప్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్

    సుదీప్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్

    చిక్ మంగళూరులోని జెఎంఎఫ్‌సీ న్యాయస్థానం నోటీసులు జారీ చేసినప్పటికీ సుదీప్ గానీ, ప్రొడక్షన్ హౌస్ నిర్వాహకులు స్పందించకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మే 22 తేదీలోగా సుదీప్ ఆచూకీ తెలుసుకొని కోర్టు ముందు హాజరు పరుచాల్సింది అని కర్ణాటక పోలీసులను కోర్టు ఆదేశించింది. సుదీప్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్లు రిలీజ్ కావడంతో కన్నడ సినీ పరిశ్రమలో ఈ వివాదం హాట్ టాపిక్‌గా మారింది.

    English summary
    Hero Sudeep Kiccha gets arrest warrant from JMFC court of Chikmagalur. One of the Coffee Estate owner filed a case against Sudeep on Cheating. Court issued non bailable warrant and asked police to make appearance before May 22nd.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X