twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్నికల బరిలో సుమలత: రజనీకాంత్, చిరంజీవి మద్దతు, వెన్నంటి ఉన్న కెజీఎఫ్ స్టార్!

    |

    ప్రముఖ నటి, దివంగత నటుడు, కన్నడ పొలిటీషియన్ అంబరీష్ సతీమణి సుమలత రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కర్నాటకలోని మాండ్య లోక్ సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆమె జడి(ఎస్) అభ్యర్థి, కర్నాటక సీఎం హెచ్.డి కుమారస్వామి తనయుడు, యంగ్ హీరో నిఖిల్ మీద పోటీ చేయబోతున్నారు.

    తన కుమారుడు అభిషేక్‌తో పాటు కన్నడ హీరోలు దర్శన్, యష్‌లతో కలిసి సుమలత బెంగుళూరులో మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి రావాలని మాండ్య ప్రజలు కోరుకుంటున్నారని, వారి కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

    కన్నడ సినిమా పరిశ్రమ మద్దతు

    కన్నడ సినిమా పరిశ్రమ మద్దతు

    కన్నడ సినిమా పరిశ్రమ మొత్తం తనకు మద్దతు ఇస్తోందని, అందరూ తాను పోటీచేయాలని కోరుకుంటున్నారని తెలిపారు. మార్చి 20 నామినేషన్ దాఖలు చేయబోతున్నట్లు ఈ సందర్భంగా సుమలత స్పష్టం చేశారు.

    వాటిని తిరస్కరించాను

    వాటిని తిరస్కరించాను

    తన భర్త అంబరీష్ రాజకీయల్లో ఉండి మాండ్య ప్రజలకు సేవ చేశారు, ఆయన ఆశయాలను కొనసాగించమే తన లక్ష్యమని సుమలత తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీలు తనను బెంగుళూరు నార్త్, బెంగుళూరు సౌత్ నుంచి పోటీ చేయాలని కోరారని, అయితే తాను వాటిని తిరస్కరించినట్లు తెలిపారు.

    నాకు మాండ్య ప్రజలే ముఖ్యం

    నాకు మాండ్య ప్రజలే ముఖ్యం

    నాకు ఎంఎల్‌సి పోస్ట్ కూడా ఆఫర్ చేశారు. కానీ నాకు వద్దని చెప్పాను. నేను మాండ్య ప్రజల కోసమే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. మాండ్య తప్ప మరేమీ అవసరం లేదు. ఇక్కడి ప్రజల అభివృద్ధి కోసం పోరాటం చేస్తాను. ఓటమి గురించి తాను భయపడటం లేదని సుమలత వెల్లడించారు.

    అందుకే స్వతంత్ర అభ్యర్థిగా

    అందుకే స్వతంత్ర అభ్యర్థిగా

    వాస్తవానికి సుమలత తన భర్త అంబరీష్ పని చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచే ‘మాండ్య'లో పోటీ చేయాలనుకున్నారు. అయితే కర్నాటకలో జెడి(ఎస్), కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఉండటంతో ఈ సీటు జేడీ(ఎస్) ఖాతాలో పడింది. దీంతో ఆమె స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేయాలని నిర్ణయించుకున్నారు.

    సాండల్‌వుడ్ మొత్తం ఆమె వైపే

    సాండల్‌వుడ్ మొత్తం ఆమె వైపే

    మరో వైపు సినిమా పరిశ్రమ నుంచి కూడా సుమలతకు పూర్తి మద్దతు ఉంది. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ రాక్ లైన్ వెంకటేష్ మాట్లాడుతూ కన్నడ సినిమా పరిశ్రమ మొత్తం సుమలత వైపు ఉందని తెలిపారు. సుదీప్, పునీత్ రాజ్ కుమార్ లాంటి స్టార్లు సైతం ఆమెకు తమ మద్దతు ప్రకటించారు.

    మేము వారి ఇంటి పిల్లలం అంటున్న దర్శన్, యష్

    మేము వారి ఇంటి పిల్లలం అంటున్న దర్శన్, యష్

    కెజిఎఫ్ స్టార్ యష్, మరో స్టార్ దర్శన్ సుమలతకు వెన్నంటి ఉంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ఈ ఇద్దరు సుమలతతో కలిసి కాంపెయిన్ నిర్వహించబోతున్నారు. దర్శన్ మాట్లాడుతూ... నేను ఒక సినిమా నటుడిగా సుమలతకు మద్దతు ఇవ్వడం లేదు...అంబరీష్ ఇంటి బిడ్డగా తమ బాధ్యతను నిర్వర్తించబోతున్నట్లు తెలిపారు.

    రజనీకాంత్, చిరంజీవి మద్దతు

    రజనీకాంత్, చిరంజీవి మద్దతు

    తనకు కేవలం కన్నడ సినీ పరిశ్రమ నుంచే కాదు... బయటి పరిశ్రమల నుంచి అంబరీష్‌కు క్లోజ్ ఫ్రెండ్స్ రజనీకాంత్, చిరంజీవి లాంటి స్టార్స్ కూడా నాకు మద్దతు ఇచ్చారు, నా నిర్ణయాన్ని సమర్ధించారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని తనను ప్రోత్సహించారని సుమలత చెప్పుకొచ్చారు.

    English summary
    Actor Sumalatha Ambareesh on Monday announced that she will contest the elections from the Mandya Lok Sabha constituency as an Independent candidate. She will be taking on Chief Minister H D Kumaraswamy's son Nikhil, who is the JD(S) candidate. Producer and distributor Rockline Venkatesh said that Sandalwood was by Sumalatha's side. "Actors Rajnikanth and Chiranjeevi, who were good friends of Ambareesh have applauded my decision. They said that I have taken a step in the right direction," Sumalatha said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X