twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీఎం కొడుకుతో సుమలత ఢీ.. వేడిక్కిన పాలిటిక్స్.. చీలిపోతున్న కన్నడ పరిశ్రమ!

    |

    కన్నడ చిత్ర పరిశ్రమలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. సినీ పరిశ్రమ రెండు వర్గాలు చీలిపోయి తమ నచ్చిన అభ్యర్థులకు మద్దతు తెలిపేందుకు అడుగులు వేస్తున్నారు. మాజీ ఎంపీ, స్వర్గీయ అంబరీష్ సతీమణి సుమలత, కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. సుమలతకు మద్దతిచ్చేందుకు కొందరు సినీ నటులు, నిఖిల్ వైపు మరికొందరు జట్లుగా చిలీపోతున్నారు. వివరాల్లోకి వెళితే..

    క్రేజీ బయోపిక్‌లో కీర్తీ సురేష్... రెండు చిత్రాలతో బాలీవుడ్ ఎంట్రీ.. హీరోలు ఎవరంటే! క్రేజీ బయోపిక్‌లో కీర్తీ సురేష్... రెండు చిత్రాలతో బాలీవుడ్ ఎంట్రీ.. హీరోలు ఎవరంటే!

     సుమలత వర్సెస్ నిఖిల్

    సుమలత వర్సెస్ నిఖిల్

    కన్నడ పరిశ్రమలో పాలిటిక్స్ యమ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. తన భర్త అంబరీష్ ప్రాతినిత్యం వహించిన మాండ్య పార్లమెంట్‌ నుంచి ఎన్నికల బరిలోకి దిగేందుకు సుమలత రంగం సిద్ధం చేసుకొంటున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కూడా రెడీ అవుతున్నాడు. దాంతో ఈ నియోజకవర్గం క్రేజీగా మారింది.

    సమలతకు అనూహ్య మద్దతు

    సమలతకు అనూహ్య మద్దతు

    నటి సుమలతకు యువ హీరో దర్శన్, నిర్మాత రాక్‌లైన్ వెంకటేస్, సీనియర్ నటుడు దొడ్డన్న మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా హీరో దర్శన్ మాట్లాడుతూ.. గతంలో అప్పాజీ (అంబరీష్)‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. అందుచేత ఈ సారి కూడా అమ్మ (సుమలత)కు నేను మద్దతు ఇవ్వాలని అనుకొంటున్నాను. పార్టీలకతీతంగా గతంలో నా సన్నిహితులకు సపోర్ట్ చేశాను అని అన్నారు.

    సుమలతకు దర్శన్ సపోర్ట్

    సుమలతకు దర్శన్ సపోర్ట్

    భవిష్యత్‌లో రాజకీయాల్లోకి వస్తారా? అనే ప్రశ్నకు దర్శన్ సమాధానం ఇస్తూ.. నాకు పాలిటిక్స్ అంటే పడవు. నన్ను కొడుకులా భావించే సుమలతకు మద్దతు ఇవ్వడం కోసమే నా ప్రయత్నం. ప్రచారంలో పాల్గొనేంత వరకే నా బాధ్యత అని దర్శన్ వెల్లడించారు.

    సుదీప్, యష్ మల్లగుల్లాలు

    సుదీప్, యష్ మల్లగుల్లాలు

    ఇక సుదీప్, ఇతర నటులు ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. రాజకీయాలంటే నాకు పడవు అని సుదీప్ స్పష్టం చేశారు. ఎవరికీ ప్రచారం చేయాలనే విషయం కూడా ఆలోచించడం లేదు. సినిమానే నా జీవితం. రాజకీయాల గురించి నాకు పెద్దగా తెలియదు అని సుదీప్ అన్నారు.

    కాంగ్రెస్ తరఫున సుమలత

    కాంగ్రెస్ తరఫున సుమలత

    ఇదిలా ఉంటే సుమలతకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ కాంగ్రెస్ టికెట్ ఇవ్వకుండే స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగే ఆలోచనలో సుమలత ఉన్నారు. రానున్న రోజుల్లో సుదీప్, యష్ ఇతర హీరోలు సుమలతకు మద్దతు ఇచ్చే పరిస్థితి లేకపోలేదనే మాట వినిపిస్తున్నది.

    నిఖిల్ గౌడ విస్తృత ప్రచారం

    నిఖిల్ గౌడ విస్తృత ప్రచారం

    సుమలత అభ్యర్థిత్వం ఖారారు కావాల్సి ఉండగా, జేడీయూ పార్టీ తరఫున తన కుమారుడు నిఖిల్ గౌడను నిలిపేందుకు ముఖ్యమంత్రి కుమారస్వామి పావులు వేగంగా కదుపుతున్నాడు. ఇప్పటికే మాండ్యా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

    English summary
    Sumalatha is likely to contest as an independent contestant if Congress fails to give her the ticket due to colation compulsion as JD(S) busy promoting Nikhil Gowda, son of Chief Minister HD Kumaraswamy, as its candidate. Darshan has extended his support to Sumalatha, who is willing to contest from Mandya in upcoming general elections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X