twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సన్నిలియోన్‌కు సెగ.. చెప్పుల దండతో నిరసన.. దిష్టిబొమ్మ దగ్ధం!

    |

    Recommended Video

    Sunny Leone And Veeramadevi Face Opposition

    శృంగార తార సన్నిలియోన్‌కు కన్నడ సామాజిక కార్యకర్తల నుంచి సెగ తగిలింది. సన్నిలియోన్ నటిస్తున్న వీరమదేవీ సినిమాను నిలిపివేయాలని, లేదంటే దానిని అడ్డుకొంటామని హెచ్చరించారు. సన్నీలియోన్ టైటిల్ పాత్రలో ఈ చిత్రాన్ని దర్శకుడు వాడిఉదయన్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. రిలీజ్‌కు ముందు సినిమా వివాదాల్లో చిక్కుకోవడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

    సన్నీ వీరనారిగా నటించడమా?

    సన్నీ వీరనారిగా నటించడమా?

    సన్నిలియోన్ లాంటి శృంగార తార వీరనారిగా నటించడమా? అని కర్ణాటక రక్షణ వేదిక మండిపడింది. బెంగళూరులోని టౌన్ హాల్‌లో ధర్నా, నిరసన కార్యక్రమాలను చేపట్టింది. రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

    పోస్టర్లను తగులబెట్టిన

    పోస్టర్లను తగులబెట్టిన

    వీరమదేవీ సినిమాకు సంబంధించిన సన్నిలియోన్ పోస్టర్లను తగులబెట్టారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నగరంలోకి రాకుండా సన్నిలియోను అడ్డుకొంటాం అని కార్యకర్తలు హెచ్చరించారు.

    దిష్టిబొమ్మకు చెప్పుల దండ

    దిష్టిబొమ్మకు చెప్పుల దండ

    వీరమదేవి చిత్రానికి వ్యతిరేకంగా గతవారం కూడా ఈ సంస్థ నిరసన ప్రదర్శన నిర్వహించింది. సన్నిలియోన్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. కరవే యువ సేన అనే మరో సంస్థ కూడా ఈ సినిమాపై అభ్యంతరం లేవనెత్తుతున్నది.

    డైరెక్టర్ హద్దులు దాటాడు.. చెప్పుతో కొట్టా.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ హాట్ కామెంట్స్! డైరెక్టర్ హద్దులు దాటాడు.. చెప్పుతో కొట్టా.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ హాట్ కామెంట్స్!

    మూడు భాషల్లో వీరమదేవీ

    మూడు భాషల్లో వీరమదేవీ

    వీరమదేవీ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్నది. ఈ సినిమా ద్వారా సన్నిలియోన్ పూర్తిస్థాయిలో తమిళంలోకి అడుగుపెడుతున్నారు. గతంలో వడ కర్రీ అనే సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది.

    English summary
    Sunny Leone has been facing a lot of opposition from a few pro-Kannada groups for playing the role of warrior queen Veeramahadevi in the upcoming multi-lingual film Veeramadevi, directed by Vadivudayan. An organisation called Karnataka Rakshana Vedike staged a protest in front of the Town Hall in Bengaluru.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X