twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘విక్రాంత్ రోణ’ అప్డేట్.. సర్ ప్రైజ్ అంటూ కిచ్చా సుదీప్ రచ్చ

    |

    కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తెలుగులోనూ ఫేమస్. ఈగ సినిమాతో విలన్‌గా పరిచయమైన సుదీప్ ఆ తరువాత డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. గతేడాది సుల్తాన్ అంటూ అందరినీ మెప్పించేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ సినిమా అంతా వర్కవుట్ అవ్వలేదు. అలా కిచ్చా సుదీప్ తెలుగులో హీరోగా సరైన సక్సెస్ సాధించలేకపోయాడు. కానీ గెస్ట్ రోల్స్‌తో సుదీప్ ఆకట్టుకుంటున్నాడు.

    సైరా సినిమాలో సుదీప్ పోషించిన పాత్రకు మంచి స్పందన వచ్చింది. చిరంజీవి పాత్ర తరువాత అందరూ గుర్తుంచుకోదగ్గ పాత్ర సుదీప్‌ది. అలా సుదీప్ టాలీవుడ్ అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అంతే కాకుండా గత ఏడాది బిగ్ బాస్ స్టేజ్ మీద కనిపించి రచ్చ చేశాడు. ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ షూటింగ్‌లో భాగంగా హైద్రాబాద్‌కు వచ్చిన సుదీప్ అలాగే బిగ్ బాస్ స్టేజ్ మీదా కనిపించాడు.

    surprise From Kiccha sudeep Vikrant Rona on 15th April

    అలాంటి సుదీప్ ఇప్పుడు మరో చిత్రంతో ప్యాన్ ఇండియన్ లెవెల్‌లో రాబోతోన్నాడు. విక్రాంత్ రోణాగా రాబోతోన్న సుదీప్.. తన సినిమాను గ్రాండ్ లెవెల్‌లో ప్రమోట్ చేసుకుంటున్నారు. ఏకంగా బుర్జ్ ఖలీఫా మీద విక్రాంత్ రోణా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇక ఏప్రిల్ 15న ఉదయం 11 గంటల 10 నిమిషాలకు ఈ మూవీ నుంచి సర్ ప్రైజ్ రాబోతోందంటూ తాజాగా మూవీ యూనిట్ ప్రకటించింది. విక్రాంత్ రోణాగా సుదీప్ తన విశ్వరూపాన్ని చూపించేందుకు రెడీ అయ్యాడు.

    English summary
    surprise From Kiccha sudeep Vikrant Rona on 15th April,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X