యువ హీరో చిత్రంలో తమన్నా ఐటమ్ సాంగ్!
మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ జోరు కాస్త తగ్గింది. తమన్నా నటించిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద వరుసగా బోల్తా కొడుతున్నాయి. ఇదిలా ఉండగా తమన్నా విభిన్న చిత్రాలపై దృష్టి పెడుతూనే ఐటెం సాంగ్స్ లో నటిస్తోంది. తెలుగులో తమన్నా నటించిన ఐటెం సాంగ్స్ కు మంచి డిమాండ్ ఉంది. అల్లుడు శీను, స్పీడున్నోడు, జై లవకుశ వంటి చిత్రాల్లో తమన్నా ఐటెం సాంగ్స్ చేసింది.
తాజాగా కన్నడ చిత్రాల్లో కూడా ఐటెం సాంగ్స్ చేయడానికి మిల్కీ బ్యూటీ సిద్ధమైపోయింది. యువ హీరో యాష్ నటిస్తుం పీరియాడిక్ డ్రామా కె జి ఎఫ్ చిత్రంలో తమన్నా ఐటమ్ సాంగ్ చేయబోతోంది. తాజగా తమన్నా ఈ సాంగ్ షూటింగ్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది.

తమన్నాకు యువతలో ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని దర్శక నిర్మాతలు ఐటమ్ సాంగ్స్ కి ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











